జాతీయ వార్తలు

సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ప్రతిపక్షం సైన్యాన్ని వివాదంలోకి లాగటం ద్వారా రాజకీయం చేస్తోందని సమాచార శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు శుక్రవారం రాజ్యసభలో ఆరోపించారు. రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ రామ్రావ్ భామ్రే ప్రతిపక్షం ఆరోపణలను తిప్పికొడుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో సంప్రదించిన తరువాతే 19 చోట్ల శాంతి భద్రతలు, టోల్ గేట్ల నిర్వహణాశిక్షణ చేపట్టిందని వివరించారు. తృణమూల్ కాంగ్రెస్ సభ్యు లు మాత్రం ఎన్‌డిఏ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధిస్తోందని ఆరోపించారు. రాజ్యసభ శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశం కాగానే కాంగ్రెస్, టిఎంసి సభ్యులు పశ్చిమ బెంగాల్‌లో సైన్యం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించటం గురిం చి ప్రస్తావించారు. తొలుత ఉపాధ్యక్షుడు పిజె కురియన్ ప్రభుత్వ ప్రభుత్వ పత్రాలను సభకు సమర్పింపజేసిన అనంతరం జీరో అవర్ చేపట్టారు. తరువాత ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌లో సైన్యం మొహరింపుపై ప్రభుత్వాన్ని నిలదీశారు.‘సిఎం మమతా బెనర్జీ గురువారం రాత్రి నుంచి సచివాలయంలోనే ఉన్నారు. సైన్యం టోల్‌గేట్‌ను స్వాధీనం చేసుకోవల్సి వచ్చింది?’ అని ప్రశ్నించారు. ఈ దశలో వెంకయ్యనాయుడు సైన్యం మొహరింపునకు సంబంధించి ఆజాద్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. సైన్యా న్ని రాజకీయాల్లో లాగవద్దని చెప్పారు. టిఎంసి సభ్యుడు సుఖేందురాయ్ మాట్లాడుతూ సైన్యం గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ చోటుచేసుకున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి బిజెపి పక్షం సభ్యులు అభ్యంతరం చెప్పగా రాయ్ పరుషంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక పోలీసులకు చెప్పకుండా ఎలా వ్యవహరిస్తారని అడిగారు. పశ్చిమ బెంగాల్‌లో భయానక వాతావరణాన్ని సృష్టించేందుకే సైన్యాన్ని మొహరించారని ఆయన ఆరోపించారు. బ్రిటీష్ పాలకులతో పోరాడిన బెంగాల్ ప్రజలు నరేంద్ర మోదీతో కూడా పోరాడుతారని రాయ్ హెచ్చరించారు. ఎన్‌డిఏ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్‌లో సైన్యాన్ని మోహరించటం ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందంటూ తృణమూల్, కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు పెద్ద ఎత్తున గొడవ చేశారు. కాంగ్రెస్ సభ్యులు ఎంఏ ఖాన్, టి సుబ్బిరామిరెడ్డితోపాటు పలువురు ప్రతిపక్ష సభ్యులు పోడియం వద్దకు దూసుకొచ్చి గొడవ చేశారు.

చిత్రం.. రాజ్యసభలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు