జాతీయ వార్తలు

జాతీయ గీతాన్ని కోర్టుల్లో ఆలపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో విచారణలు మొదలు పెట్టడానికి ముందు తప్పనిసరిగా జాతీయ గీతాన్ని ఆలపించేలా ఆదేశివ్వాలని కోరుతూ బిజెపి అధికార ప్రతినిధి, న్యాయవాది అశ్వని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. సినిమా హాళ్లలో తప్పనిసరిగా జాతీయ గీతాన్ని ఆలపించాలని ఇటీవల తీర్పు చెప్పిన న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, అమితవ రాయ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకే ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి అభిప్రాయాన్ని తెలుసుకున్న తరువాత ఈ పిటిషన్‌ను విచారించడానికి మొగ్గు చూపడం లేదని ధర్మాసనం ప్రకటించింది. ‘తప్పయినా ఒప్పయినా, మా ఆదేశాలను అతిగా సాగదీయొద్దు. బార్ కౌన్సిల్ సభ్యులు సంయమనం పాటించాలి. కొత్త నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి’ అని ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్ సరయిన అప్లికేషన్‌ను సమర్పించాలని అటార్నీ జనరల్ సూచించారు.