జాతీయ వార్తలు

ఇంకెన్నాళ్లు.. కరెన్సీ కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, ఇబ్బందులను తొలగించడానికి తీసుకొంటున్న చర్యలేమిటో తక్షణం తెలియజేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రాన్ని ఆదేశించింది. గ్రామీణ ప్రజలు ఎక్కువగా సహకార బ్యాంకులపై ఆధారపడి ఉంటారని, అందువల్ల సహకార బ్యాంకులకు ఎక్కువ సొమ్ము పంపి వారి కష్టాలను తగ్గించాలని ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్, జస్టిస్ డివై చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్ సూచించింది. కాగా, నోట్ల రద్దుకు సంబంధించిన వివిధ అంశాలను సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్లను విచారిస్తున్న బెంచ్ కక్షిదారులందరూ కలిసి కూర్చుని హైకోర్టులకు నివేదించాల్సిన కేసులు ఏవో, సుప్రీంకోర్టు వినాల్సినవి ఏమిటో కేటగిరీలవారీగా ఒక జాబితాను తయారు చేయాలని సూచించింది. కాగా, సహకార బ్యాంకుల్లో పరిస్థితి ఏమిటో కేంద్రానికి తెలుసునని, షెడ్యూల్డ్ బ్యాంకులతో పోలిస్తే సహకార బ్యాంకుల్లో సరయిన వౌలిక సదుపాయాలు, యంత్రాంగం లేవని కేంద్రం తరఫున వాదించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ చెప్పారు. కేంద్రం దాఖలు చేసి అదనపు అఫిడవిట్‌లోని ఒక అధ్యాయం మొత్తం సహకార బ్యాంకుల అంశానికే కేటాయించినట్లు ఆయన చెప్పారు. నకిలీ కరెన్సీని గుర్తించే నైపుణ్యం సహకార బ్యాంకులకు లేదని, అందువల్ల కేంద్రం ఉద్దేశపూర్వకంగానే సహకార బ్యాంకులను ఈ ఉద్యమంనుంచి దూరంగా పెట్టినట్లు రోహత్గీ చెప్పారు. నోట్ల రద్దు అనంతరం అనేక అంశాలకు సంబంధించి ప్రతి రోజూ వివిధ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలవుతున్నాయని, కేరళ, కోల్‌కతా, జైపూర్, ముంబయి.. ఇలా ఏకకాలంలో పలు ప్రాంతాల్లో దాఖలయిన కేసులను ఎదుర్కోవడం సాధ్యం కాదని ఆయన అంటూ, అందువల్ల, ఈ విషయాలన్నిటినీ కలిపి ఏదయినా ఒక హైకోర్టుకు నివేదించాలని, లేదా సుప్రీంకోర్టు విచారించాలని అన్నారు.
కాగా, నోట్ల రద్దు వ్యవహారంలో సహకార బ్యాంకులను దూరంగా పెడ్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సహకార బ్యాంకుల తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది పి. చిదంబరం తప్పుబడుతూ, సహకార బ్యాంకులను చేర్చకపోవడం వల్ల మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దాదాపుగా స్తంభించిపోయిందని అన్నారు. కాగా, తామంతా కలిసి కూర్చుని చర్చించి సోమవారం నాటికల్లా కేటగిరీల జాబితాను దాఖలు చేస్తామని, ఒక పిటిషనర్ తరఫు న్యాయవాది పిల్ సిబల్ చెప్పారు. అనంతరం కోర్టు కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.