జాతీయ వార్తలు

30నాటికి మెరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: దేశ వ్యాప్తంగా శుక్రవారం కూడా అన్ని బ్యాంకులు, ఎటిఎమ్‌లలో నగదు కటకట కొనసాగిన నేపథ్యంలో ఈ నెలాఖరు వరకూ దాదాపుగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని, అప్పట్లోగా పరిస్థితిని గణనీయంగా మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. డిసెంబర్ 30నాటికి దేశంలో కరెన్సీ కొరత గణనీయంగా తీరుతుందని చెప్పారు. అయితే, 500, 1000 నోట్ల రద్దుకు ముందు దేశంలో వీటి పరిమాణం ఎంత ఉండేదో అంతా ఇక నుంచి ఉండక పోవచ్చునని పేర్కొన్నారు. అంటే ఒకప్పుడు ఉన్నంత పరిమాణంలో కాగితం కరెన్సీ ఇక మీద ఉండదన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని తెలిపారు. ఏడు దశాబ్దాలుగా నల్లధనమే దేశంలో రాజ్యం చేసిందని, నగదు రద్దు అనంతరం సరికొత్త పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి మూడుసార్లు పన్ను మదింపునకు లోనుకావాల్సి ఉంటుందని..్భవిష్యత్‌లో దీన్ని ఒకటికి తగ్గిస్తామని తెలిపారు.
జిఎస్‌టి రాజ్యాంగ నిర్బంధం: జైట్లీ
వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి దేశ వ్యాప్తంగా జిఎస్‌టి అమలుకావాల్సిందేనని, ఇది రాజ్యాంగ నిర్బంధనమని అరుణ్ జైట్లీ ఉద్ఘాటించారు. సెప్టెంబర్ 16నాటికి దేశంలో పరోక్ష పన్నుల వ్యవస్థ అంతమైపోతుందని..అప్పటికి కొత్త వ్యవస్థ అమలులోకి రాకపోతే రెవిన్యూ వసూళ్లే ఆగిపోయే పరిస్థితి తలెత్తుతుందని అన్నారు.

చిత్రం..న్యూఢిల్లీలో శనివారం నిర్వహించిన 5వ జిఎస్టీ కౌన్సిల్
సమావేశంలో మాట్లాడుతున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ