జాతీయ వార్తలు

బెడిసికొట్టిన మావోల వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, డిసెంబర్ 2: పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాల నేపథ్యంలో భారీ విధ్వంసానికి మావోయిస్టులు పన్నిన వ్యూహం పోలీసుల అప్రమత్తతతో పెద్ద ముప్పు తప్పింది. జాతీయ రహదారిపై కరపత్రాలు, బ్యానర్ల కింద టిఫిన్ బాంబులు, డిటోనేటర్లు అమర్చగా, ఒఎస్‌డి ఫకీరప్ప పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి వెళ్లి చాకచక్యంగా వ్యవహరించి బాంబులను నిర్వీర్యం చేశారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సరివెల గ్రామ సమీపంలోని జాతీయ రహదారి 30పై గురువారం అర్ధరాత్రి మావోయిస్టులు కరపత్రాలను, బ్యానర్లను వదిలారు. వీటి కింద మూడు టిఫిన్ బాంబులు, ఒక డిటొనేటర్‌ను అమర్చారు. సమాచారం అందుకున్న ఒఎస్డీ ఫపకీరప్ప పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని అణువణువూ క్షుణ్ణంగా గాలించి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాకచాక్యంగా రహదారిపై ఉన్న కరపత్రాలు, వాటికింద ఉన్న బాంబులను నిర్వీర్యంచేసి స్వాధీనం చేసుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కరపత్రాలు, బ్యానర్లు, పోస్టర్లు సిపిఐ మావోయిస్టు చర్ల శబరి ఏరియా కమిటీ పేరున వదిలారు. ఈ లేఖల్లో ఆపరేషన్ గ్రీన్ హంట్ మూడవ బహుముఖ దాడిని ఓడిద్దామని పిలుపునిచ్చారు. అలాగే ఇటీవల ఒడిస్సా ఎన్‌కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టులకు ఆ లేఖలో నివాళులు అర్పించారు.