జాతీయ వార్తలు

నోట్ల రద్దు జైట్లీకి ముందే తెలుసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కూడా తెలియదంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ శనివారం దీనిపై స్పందించారు. నోట్ల రద్దు నిర్ణయం అరుణ్ జైట్లీకి ముందే తెలిసి ఉంటుందని వ్యాఖ్యానించారు. స్నేహంగా, బాహాటంగా వ్యవహరించే జైట్లీ సైతం ఆ విషయాన్ని రహస్యంగా ఉంచారని అన్నారు. ‘నోట్ల రద్దు బాంబు పడిన తర్వాత జైట్లీ దాన్ని ఎలా రహస్యంగా ఉంచగలిగారని అందరూ ఆశ్చర్యపోయారు.. గొప్ప నేతల నిబద్ధత అది. కొన్ని ప్రత్యేక సందర్భాలు వచ్చినప్పుడు వారు అతి ముఖ్యమైన సమాచారాన్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచుతారు’ అని శనివారం ఇక్కడ హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సదస్సులో మాట్లాడుతూ పీయూష్ గోయల్ అన్నారు. ఈ విషయం జైట్లీకి తెలుసా అని ప్రశ్నించగా, ‘అవును కచ్చితంగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆర్థిక మంత్రి’ అని గోయల్ అన్నారు. రాయితీలను దుర్వినియోగం చేస్తున్న వారిపై ప్రభుత్వం కొరడా ఝళిపించి తీరుతుందని గోయల్ స్పష్టం చేశారు. నిజాయితీపరులైన ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిని సైతం వదిలిపెట్టేది లేదని ఆయన అన్నారు.