జాతీయ వార్తలు

సాహసోపేత నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని సాహసోపేతమైన నిర్ణయంగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి అభివర్ణించారు. అంతేకాదు, దీనివల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. న్యూఢిల్లీలో జరుగుతున్న హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో శనివారం నితీశ్ కుమార్ పాల్గొన్నారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బిఎస్పీలాంటి ప్రతిపక్షాలన్నీ కూడా నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, ప్రతిపక్షాలకే చెందిన నితీశ్ కుమార్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని గట్టిగా సమర్థిస్తూ ఉండడం గమనార్హం. అయితే కేవలం పాతనోట్లను రద్దు చేసినంతమాత్రాన నల్లధనం అదుపు కాదని, బినామీ ఆస్తులపైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నితీశ్ అభిప్రాయ పడ్డారు. కాగా, 2019 ఎన్నికల్లో మీరు ప్రధాని అభ్యర్థిగా ఉంటారా? అని అడగ్గా, ప్రధాని పదవి చాలా పెద్ద బాధ్యత అని, దానిపై తేలిక సమాధానం చెప్పడం భావ్యం కాదని అన్నారు. 2019 ఎన్నికలకోసం ఒక కూటమిగా ఏర్పడడానికి బిజెపియేతర ప్రతిపక్షాల మధ్య ప్రయత్నాలయితే జరుగుతున్నాయి కానీ, సీరియస్ ప్రయత్నాలు మాత్రం జరగడం లేదని అన్నారు. బిహార్‌లో మహాకూటమి అయిదేళ్లు కొనసాగుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు, తనకు, ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్‌కు మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని కూడా స్పష్టం చేశారు.