జాతీయ వార్తలు

ఏపికి హైకోర్టును ఏర్పాటు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: ఆంధ్రప్రదేశ్ హైకోర్టును హైదరాబాద్‌లో తాత్కాలిక భవనాల్లో ఏర్పాటు చేయాలని తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్‌ను కోరింది. ఈ మేరకు వారు ఒక వినతిపత్రం సమర్పించారు. తాత్కాలిక భవనాలు ఈ ఏడాది జూన్ 15 నాటికి సిద్ధమవుతాయన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు గండ్ర మోహన్‌రావు, కార్యదర్శి వి రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్‌ను కలిశారు. ఉమ్మడి హైకోర్టును వీలైనంత త్వరగా విభజించాలని, అలాగే ఏపి హైకోర్టుకు వేరుగా న్యాయమూర్తులను నియమించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది జూన్ నాటికి సచివాలయం, అసెంబ్లీని అమరావతికి తరలిస్తోందన్నారు. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా గత కొన్ని నెలలుగా గుంటూరు-విజయవాడ నుంచి పనిచేస్తున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధాని నిర్మించే వరకు హైకోర్టును విభజించకుండా ఉండడం వల్ల తమకు అన్యాయం జరుగుతుందన్నారు. హైదరాబాద్ హైకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 49 అని, కాని ఇటీవల ఈ సంఖ్యను 61కు పెంచారన్నారు. ప్రస్తుతం హైకోర్టులో 25 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారన్నారు. వచ్చే నెలలో మరో ఇద్దరు న్యాయమూర్తులు పదవీ విరమణ చేయనున్నారన్నారు. 25 మంది న్యాయమూర్తుల్లో నలుగురు మాత్రమే తెలంగాణ నుంచి ఉన్నారని, ఇందులో ముగ్గురు బార్ అసోసియేషన్ నుంచి ఒకరు కింది కోర్టు నుంచి పదోన్నతిపై న్యాయమూర్తులుగా నియమితులయ్యారన్నారు.

chitram హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన న్యాయ సేవాధికార సంస్థ సదస్సులో ప్రసంగిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్