జాతీయ వార్తలు

అజిత్ దోవల్‌తో సర్తాజ్ భేటీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత్‌సర్, డిసెంబర్ 4: ‘హార్ట్ ఆఫ్ ఏసియా’ సదస్సుకు హాజరయిన సర్తాజ్ అజీజ్ శనివారం రాత్రి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సమావేశమైనట్లు సమాచారం. నగ్రోటా ఉగ్రవాద దాడి, కాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ కాల్పులు దృష్ట్యా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయిన నేపథ్యంలో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ‘సదాపిండి’ హెరిటేజ్ విలేజ్‌లో జరిగిన విందు వేదిక వద్ద అజీజ్, దోవల్ ఇద్దరూ వంద అడుగుల దూరం కలిసి నడిచారని భారత అధికార వర్గాలు చెప్తుండగా, పాకిస్తాన్ అధికారులు మాత్రం వారు సమావేశమయినట్లు చెప్పడం గమనార్హం.