జాతీయ వార్తలు

ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత్‌సర్, డిసెంబర్ 4: ఉగ్రవాద మూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అషఫ్ ఘనీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాలిబాన్‌సహా అనేక ఉగ్రవాద గ్రూపులకు మద్దతు తెలపడం ద్వారా పాకిస్తాన్ తమ దేశంపై ‘అప్రకటిత యుద్ధాన్ని’ ప్రారంభించిందని ఆయన నిప్పులు చెరిగారు. యుద్ధంతో అతలాకుతలమైన అఫ్గాన్‌లో భారత్ కార్యకలాపాలు పెరగడం వెనుక ఎటువంటి రహస్య ఒప్పందాలు లేవని ఘనీ స్పష్టం చేశారు. అమృత్‌సర్‌లో ఆదివారం ఆయన ‘హార్ట్ ఆఫ్ ఆసియా’ 6వ వార్షిక సదస్సులో ప్రసంగిస్తూ పాక్ దుర్నీతిని ఎండగట్టారు. ఉగ్రవాదం, అతివాదంతోపాటు ఇతర అక్రమ కార్యకలాపాల ద్వారా ప్రయోజనం పొందుతున్న వారెవరో తేల్చేందుకు అంతర్జాతీయ స్థాయిలోగానీ కనీసం ఆసియా స్థాయిలోగానీ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఘనీ ఉద్ఘాటించారు. పాకిస్తాన్‌లో ఉగ్రవాద శిబిరాలను అనుమతించకపోతే తమ సంస్థ కనీసం ఒక్క నెల కూడా మనజాలలేదని తాలిబాన్ సీనియర్ కమాండర్ ఒకడు చేసిన వ్యాఖ్యలను ఘనీ ఈ సందర్భంగా ఉటంకిస్తూ, ఉగ్రవాదుల వౌలిక వసతులతోపాటు, వారికి మద్దతు తెలుపుతున్న వారిపై ఉక్కుపాదం మోపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పాకిస్తాన్‌తో తాము ద్వైపాక్షిక, బహుళపక్ష సంబంధాలను కలిగి ఉన్నప్పటికీ 2014 నుంచి ఆ దేశం తమపై అప్రకటిత యుద్ధాన్ని ప్రారంభించిందని, అఫ్గానిస్తాన్ అభివృద్ధిపై ఇటీవల బ్రసెల్స్‌లో సదస్సు జరిగిన తర్వాత ఈ అప్రకటిత యుద్ధం మరింత ఉద్ధృతమైందని, గత కొద్ది నెలలనుంచి తమ దేశంలో సీమాంతర ఉగ్రవాద దాడులు పెరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడుల వెనుక తమ ప్రమేయం లేదని పాక్ పదే పదే బుకాయిస్తోందని, అలాగే ఉగ్రవాదాన్ని ప్రతిఘటించేందుకు అంతర్జాతీయ నిధిని ఏర్పాటు చేయాలని ఘనీ విజ్ఞప్తి చేశారు. ఘనీతో పాటు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంయుక్తంగా ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సుకు 30 దేశాల నుంచి హాజరైన ప్రతినిధుల్లో పాక్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌కు విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ కూడా ఉన్నారు.