జాతీయ వార్తలు

2లక్షల కోట్ల డిక్లరేషన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 4: ముంబయికి చెందిన ఒక సాధారణ కుటుంబం తనకు రూ.2లక్షల కోట్ల ఆదాయం ఉన్నట్టు ప్రకటించడాన్ని తిరస్కరించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించింది. స్వల్పాదాయం గల సభ్యులతో కూడిన కుటుంబం ఇంతపెద్ద మొత్తంలో ఆదాయాన్ని ప్రకటించడం అనుమానాస్పదంగా ఉందని, అందువల్ల ఆ కుటుంబం చేసిన డిక్లరేషన్‌ను తిరస్కరించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరించింది. అబ్దుల్ రజాక్ మొహమ్మద్ సరుూద్, అతని కుమారుడు మొహమ్మద్ అరీఫ్ అబ్దుల్ రజాక్ సరుూద్, భార్య రుక్సానా అబ్దుల్ రజాక్ సరుూద్, సోదరి నూర్జహాన్ మొహమ్మద్ సరుూద్‌లతో కూడిన ఈ కుటుంబం ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో నివసిస్తోంది. నల్లధనం నిర్మూలనకు ప్రవేశపెట్టిన స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం (ఇన్‌కం డిస్‌క్లోజర్ స్కీమ్- ఐడిఎస్) కింద ప్రభుత్వానికి అందిన మొత్తం రూ.65,250 కోట్లకన్నా సరుూద్ కుటుంబం ప్రకటించిన వారి ఆదాయం మూడింతలు ఎక్కువగా ఉంది. సరుూద్ కుటుంబానికి చెందిన నాలుగు పాన్ నంబర్లలో మూడు నంబర్లు అజ్మీర్ నుంచి తీసుకున్నవని, ఈ సంవత్సరం సెప్టెంబర్‌లోనే వాటిని ముంబయి చిరునామాకు మార్చుకున్నారని, తరువాత ముంబయిలోనే డిక్లరేషన్‌ను దాఖలు చేశారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. నల్లధనాన్ని స్వచ్ఛందంగా వెల్లడించి, అందులో పన్ను, సర్‌చార్జి, జరిమానా కలిపి 45 శాతం చెల్లిస్తే ఎలాంటి చర్యలు ఉండబోవని ప్రభుత్వం ప్రకటించిన ఐడిఎస్ గడువు సెప్టెంబర్ 30తో ముగిసింది.
ఇదిలా ఉండగా, రూ. 13,860 కోట్ల నల్ల ధనాన్ని స్వచ్ఛందంగా ప్రకటించిన తరువాత గత నెలలో అదృశ్యమైన అహ్మదాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త మహేశ్ షా చేసిన డిక్లరేషన్‌ను కూడా తిరస్కరించినట్లు ప్రభుత్వం తెలిపింది. మామూలు రియల్ ఎస్టేట్ డీలర్ అయిన షా ఐడిఎస్ కింద సెప్టెంబర్‌లో రూ.13,860 కోట్ల లెక్క చూపని ధనాన్ని ప్రకటించడం ద్వారా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
శనివారం పట్టుబడిన షాను ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆదివారం ఏడు గంటల పాటు విచారించారు. ఆరోగ్య పరిస్థితుల కారణంగా 67 సంవత్సరాల షా విచారణను తరువాత నిలిపివేసిన అధికారులు తిరిగి సోమవారం విచారించనున్నారు. తాను వెల్లడించిన ధనం రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, బిల్డర్లుసహా అనేక మందిదని షా ఐటి అధికారులకు చెప్పినట్లు సమాచారం.