జాతీయ వార్తలు

సబ్‌ప్లాన్ల నిధులను మురిగిపోనివ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: షెడ్యూల్డు కులాల సబ్-ప్లాన్ (ఎస్‌సిఎస్‌పి), గిరిజన సబ్-ప్లాన్ (టిఎస్‌పి)ల కింద ఎస్సీలు, ఎస్టీల అభ్యున్నతికి కేటాయించిన నిధులు మురిగిపోకుండా, సకాలంలో వాటిని సద్వినియోగం చేయడానికి అవసరమైన మార్గాలను అనే్వషించాలని నీతి ఆయోగ్‌కు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ కార్యదర్శి అధ్యక్షతన ఇటీవల ఎస్‌సిఎస్‌పి, టిఎస్‌పిల పర్యవేక్షణపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎస్‌సిఎస్‌పి పర్యవేక్షణపై కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు, నీతి ఆయోగ్‌కు మధ్య జరుగుతున్న పోరుకు కూడా ఈ సమావేశం ముగింపు పలికింది. ఇకనుంచి ఎస్‌సిఎస్‌పిని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖనే పర్యవేక్షిస్తుంది. అలాగే, టిఎస్‌పిని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది. నీతి ఆయోగ్ రూపొందించిన చట్రం ఆధారంగా ఈ రెండు మంత్రిత్వ శాఖలు తమ పరిధిలోని సబ్-ప్లాన్‌లను పర్యవేక్షిస్తాయి. ఈ పర్యవేక్షణ వ్యవస్థ రెండు నెలల్లోగా రూపుదిద్దుకుంటుంది. ఎస్సీ, ఎస్టీ సబ్-ప్లాన్‌ల కింద నిధులు కేటాయించడమే కాకుండా, ఆ నిధులు సకాలంలో సద్వినియోగం అయ్యి, సత్ఫలితాలను రాబట్టడంపై ఈ వ్యవస్థ కేంద్రీకరిస్తుందని అధికారిక పత్రం ఒకటి వెల్లడించింది.