జాతీయ వార్తలు

42 అడుగుల భారీ తిమింగలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరుదైన సముద్ర జాతికి చెందిన భారీ తిమింగలం మృత కళేబరం పూరి జిల్లాలోని బైధారా పెంతా బీచ్‌కు కొట్టుకొచ్చింది. దీని పొడవు 42 అడుగులు కాగా వెడల్పు 28 అడుగులు. ఇది పది పదిహేను రోజుల క్రితమే మృతిచెందినట్లు అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అరుదైన జాతికి చెందిన ఈ తిమింగలం పసిఫిక్ మహాసముద్ర జలాల్లో కనిపిస్తుందని, పోస్టుమార్టం తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని శతపాద ఫారెస్ట్ రేంజర్ అచ్యుతానంద దాస్ తెలిపారు. తిమింగలం మృతికి కారణాలను విశే్లషించేందుకు పశువైద్య కాలేజీ డాక్టర్లను కోరామని ఆయన వెల్లడించారు.