జాతీయ వార్తలు

ఐఐటి ఖరగ్‌పూర్‌కు పేటెంట్లలో పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 9: ఐఐటి ఖరగ్‌పూర్ 2016లో అత్యధిక పేటెంట్లు సంపాదించిన విద్యాసంస్థగా భారత ప్రభుత్వ అవార్డును దక్కించుకుంది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖనుంచి తమకు ఒక లేఖ అందినట్లు ఐఐటి ఖరగ్‌పూర్ డైరెక్టర్ పార్థ ప్రతిమ్ చక్రబర్తి చెప్పారు. తమ ‘వంద పేటెంట్ల డ్రైవ్’ ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాలనిస్తున్నాయని ఆయన అంటూ, ఈ అవార్డును సాధించేందుకు కృషి చేసిన సహచర బృందాన్ని అభినందించారు. ఇండియన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కార్యాలయం, వాణిజ్య మంత్రిత్వ వాఖ ఢిల్లీలో నిర్వహించే ప్రపంచ ఐపి దినోత్సవం వేడుకల్లో భాగంగా ఈ నెల 26న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అవార్డును అందజేస్తారు. ఈ అవార్డు కింద లక్ష రూపాయల నగదు, ఒక ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేస్తారు.