జాతీయ వార్తలు

విమాన ప్రమాదంలోనే నేతాజీ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, డిసెంబర్ 4: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18న తైపీ (తైవాన్)లో జరిగిన విమానప్రమాదంలోనే మృతి చెందినట్లు నిరూపించే తిరుగులేని సాక్ష్యాధారాలు తన వద్ద ఉన్నాయని నేతాజీ ముని మనవడు, ప్రముఖ పరిశోధకుడు అశిష్ రే ఆదివారం చెప్పారు. అందువల్ల తైవాన్‌లోని రేంజి ఆలయంలో ఉంచిన నేతాజీ చితాభస్మాన్ని భారత్‌కు తీసుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. నేతాజీ విమాన ప్రమాదంలోనే మృతి చెందారని, సోవియట్ యూనియన్‌లోకి ప్రవేశించే అవకాశమే ఆయనకు లేదని మూడు నివేదికలు స్పష్టంగా పేర్కొన్నాయి. జపాన్ ప్రభుత్వం విడుదల చేసిన రెండు నివేదికలు నేతాజీ విమానప్రమాదంలోనే మృతి చెందినట్లు స్పష్టంగా పేర్కొనగా, నేతాజీ 1945లో కానీ, ఆ తర్వాత కానీ ఒకప్పటి సోవియట్ యూనియన్‌లోకి ప్రవేశించే అవకాశమే లేదని రష్యా ప్రభుత్వ పురావస్తు భాండాగారంలో ఉన్న మరో నివేదిక కూడా స్పష్టంగా చెప్తోందని రే తెలిపారు. సోవియట్ యూనియన్‌లో నేతాజీ ఎప్పుడూ బందీగా లేరని కూడా ఆయన స్పష్టం చేశారు.