జాతీయ వార్తలు

రాత్రి ప్రయాణాలు.. విమానంలోనే నిద్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ప్రధాని నరేంద్ర మోదీది అంతా కొత్త పోకడే. దేశంలో క్షణం విరామం లేకుండా పనులు చేస్తూ, సహచర మంత్రులను, అధికారులను పరుగులు పెట్టిస్తున్న ప్రధాని విదేశీ పర్యటనల్లోను ఇంతకుముందున్న ప్రధానులకు భిన్నంగా తనదైన ముద్ర వేస్తున్నారు. మోదీ తన పర్యటనల సమయాన్ని తగ్గించుకోవడానికి రాత్రి పూట ప్రయాణాలు చేస్తూ, విమానాల్లోనే నిద్రపోతూ సమయాన్ని అదా చేసుకుంటున్నారు. బెల్జియం, అమెరికా, సౌదీ అరేబియాలో పర్యటించిన ప్రధాని ఈ మూడు దేశాల పర్యటనను కేవలం 97 గంటల్లోనే ముగించేశారని, కేవలం రెండు రాత్రులు ఒక రాత్రి వాషింగ్టన్‌లో, మరోరాత్రి రియాద్‌లో గడిపారని ఓ అధికారి చెప్పారు. మోదీ గనుక విమానంలో నిద్ర పోకపోయి ఉంటే ఆ పర్యటనకు కనీసం ఆరు రోజులు పట్టేదని కూడా ఆయన చెప్పారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విదేశీ పర్యటనలు చాలావరకు సుదీర్ఘమైనవి, ఒకటి, రెండు నగరాలకే పరిమితమై ఉండేవి. అయితే ఇప్పుడు మోదీ పర్యటనలన్నీ కూడా ఆయన ఆదేశాల మేరకు చాలావరకు కుదించడమే కాకుండా విదేశీ హోటళ్లలో బస చేయాల్సిన అవసరం లేకుండా ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఉదాహరణకు గత మార్చి 30న అర్ధరాత్రి సమయంలో బ్రసెల్స్‌కు బయలుదేరిన మోదీ తొమ్మిది గంటల ప్రయాణ కాలాన్ని నిద్రకు ఉపయోగించుకున్నారు. నిజానికి రాత్రి బ్రసెల్స్‌లో బస చేసి ఉదయాన అక్కడి ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించాల్సి ఉండింది. అయితే 31వ తేదీ వర్కింగ్ డే అయినందున తన ప్రసంగం వినడానికి ఎన్‌ఆర్‌ఐలు సెలవు తీసుకోవడం మోదీకి ఇష్టం లేకపోయింది. ‘అవసరమైతే నేను రెండు రాత్రులు వరసగా ప్రయాణంలోగడపగలను’ అని ప్రధాని తమతో చెప్పే వారని అధికారులు తెలిపారు. బ్రసెల్స్‌నుంచి వాషింగ్టన్‌కు సాగిన పది గంటల ప్రయాణం కూడా దాదాపు అదే విధంగా సాగింది.