జాతీయ వార్తలు

ఆ డాక్యుమెంట్లు మా వద్ద లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: ఎమర్జెన్సీ సమయంలో మానవ హక్కుల రద్దుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు తమ వద్ద లేవని కేంద్ర హోం శాఖ కేంద్ర సమాచార కమిషన్ (సిఐసి)కి తెలియజేసింది. కాగా, దీనికి సంబంధించి కమిషన్‌కు ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని కమిషన్ హోం శాఖను ఆదేశించింది. 1975లో ఎమర్జెన్సీ విధించిన సమయంలో మానవ హక్కుల నిలిపివేతకు సంబంధించిన రికార్డులను అందజేయాలని సమాచార హక్కు చట్టం కింద ఆర్‌టిఐ కార్యకర్త ఒకరు హోం శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే 1993లో హోం శాఖలో విభాగాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అందువల్ల దరఖాస్తుదారు కోరిన సమాచారానికి సంబందించిన రికార్డులు తమ వద్ద లేవని హోం మంత్రిత్వ శాఖలో ఒకటో నంబర్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ తెలియజేసింది. ఈ సమాచారం రెండో సెక్షన్ వద్ద ఉండవచ్చని కూడా ఆ సమాధానంలో తెలియజేసింది. అంతేకాదు, దరఖాస్తుదారు కోరిన సమాచారం ‘సమాచారం’ పరిధిలోకి రాదని కూడా హోం శాఖ ఆ దరకాస్తుదారుకు తెలియజేసింది. దీనిపై దరఖాస్తుదారు సిఐసిని ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలను విన్న తర్వాత, డాక్యుమెంట్లను పరిశీలించాక ఇన్ఫర్మేషన్ కమిషనర్ సుధీర్ భార్గవ ఈ సమాచారం తమవద్ద లేదని తెలియజేస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆ రెండు విభాగాలను ఆదేశించారు.