జాతీయ వార్తలు

రజనీకాంత్‌కు స్వల్ప గాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 4: తమిళ సినీ హీరో రజనీకాంత్ శనివారం రాత్రి ఇక్కడ ఒక సినిమా చిత్రీకరణ సందర్భంగా కిందపడిపోయి స్వల్పంగా గాయపడ్డారు. తదుపరి రానున్న తన సినిమా ‘2.0’లో ఒక సన్నివేశాన్ని ఇక్కడి కెలబాక్కంలో చిత్రీకరిస్తుండగా 66 ఏళ్ల రజనీకాంత్ అనుకోకుండా కిందపడి పోవడంతో అతని మోకాలికి స్వల్ప గాయం అయింది. అయితే ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించుకున్న రజనీకాంత్ తరువాత సినిమా చిత్రీకరణను కొనసాగించారు. ఇదిలా ఉండగా, రజనీకాంత్ ప్రస్తుతం బాగున్నారని అతని మీడియా మేనేజర్ ఆదివారం ప్రకటించారు. రజనీకాంత్ వీడియోను కూడా అతను సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు. సాధారణ దుస్తులు ధరించిన రజనీకాంత్ అభిమానులకు అభివాదం చేస్తున్నట్లు ఈ వీడియోలో ఉంది.