జాతీయ వార్తలు

ఐఎన్‌ఎస్ బెట్వాకు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 5: ముంబయి నేవల్ డాక్‌యార్డ్‌లో మరమ్మతులకోసం వచ్చి లంగరు వేసి ఉన్న నౌకాదళానికి చెందిన యుద్ద నౌక ఐఎన్‌ఎస్ బెట్వా సోమవారం లంగరు తొలగిస్తున్న సమయంలో ఒక పక్కకు ఒరిగి పోవడంతో ఇద్దరు నేవీ జవాన్లు మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు. ముంబయిలోని నేవల్ డాక్‌యార్డ్‌లోని క్రూయిజర్ గ్రౌండింగ్ డాక్ వద్ద ఈ ప్రమాదం జరిగిందని, డాక్ బ్లాక్స్ మెకానిజం వైఫల్యం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నామని నౌకాదళ ప్రతినిధి కెప్టెన్ డికె శర్మ న్యూఢిల్లీలో చెప్పారు. 2014 జనవరిలో ఈ యుద్ధనౌక ఒక గుర్తు తెలియని వస్తువును ఢీకొట్టడంతో దాని సోనార్ సిస్టమ్‌కు పగుళ్లు రావడంతో దీని సర్వీసులను నిలిపివేశారు. కాగా, మరమ్మతుల కోసం ఈ నౌక ఇటీవలే ముంబయిలోని నేవీ డాక్‌యార్డ్‌కు వచ్చింది. మరమ్మతులు పూర్తయ సోమవారం ఉదయం ఈ నౌకను తిరిగి మామూలు స్థితికి తీసుకు రావడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.