జాతీయ వార్తలు

తమిళనాట హైఅలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 5: తమిళనాడు ముఖ్యమంత్రి, కోట్లాది ప్రజల ఆరాధ్య దైవం, పురచ్చి తలైవి ఇక లేరన్న వార్త తెలియడంతోనే రాష్టమ్రంతా ఆమె అభిమానుల గుండెలవిసి పోయాయి. ఎక్కడ చూసినా అమ్మ ఇక లేరన్న వార్తను జీర్ణిచుకోలేకపోయిన అభిమానుల రోదనలు మిన్నుముట్టాయి. రాష్టమ్రంతా శోకసంద్రంలో మునిగిపోయింది. తమ ప్రియతమ నాయకురాలు లేరన్న వార్తను జీర్ణించుకోలేక వీరాభిమానులు ఎలాంటి అఘాయిత్యానికైనా పాల్పడవచ్చన్న అనుమానంతో అర్ధరాత్రి సమయంలో జయలలిత కన్ను మూశారన్న వార్తను అపోలో ఆస్పత్రి వైద్యులు బులిటన్‌ను విడుదల చేయక ముందే రాష్టమ్రంతటా హై అలర్ట్ ప్రకటించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనా జరక్కుండా చూడడానికి పెద్ద సంఖ్యలో పోలీసు, పారామిలటరీ బలగాలను మోహరించారు. అంతకు ముందే అపోలో ఆస్పత్రి నుంచి జయ నివాసం వరకూ దాదాపు 15 కిలోమీటర్ల మేర దారి పొడవునా భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ముఖ్యమంత్రి నివాసం వద్ద కూడా భారీగా భద్రతను పెంచారు.
ఉదయంనుంచే ఉద్రిక్తత
కాగా, అమ్మ ఆరోగ్యంపై నిమిషానికో వార్త తమిళ మీడియాలో వస్తుండటంతో అన్నాడిఎంకె కార్యకర్తలు, జయ అభిమానుల్లో ఆందోళన ఎక్కువ కావడంతో సోమవారం ఉదయంనుంచే రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. రాజధాని చెన్నైలో అయితే అప్రకటిత బంద్ పరిస్థితి నెలకొంది. జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రి దగ్గర మినహా మరెక్కడా జనసంచారం కరవైంది. వేలాది అన్నాడిఎంకె కార్యకర్తలు పెద్ద ఎత్తున అపోలో ఆసుపత్రికి చేరుకుని అమ్మ ఆరోగ్యం గురించి స్పష్టమైన సమాచారం ఇవ్వాలంటూ ఆందోళన చేశారు. సోమవారం మధ్యాహ్నం 2.45 గంటలకు ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అపోలో ఆసుపత్రి ప్రకటన విడుదల చేయటం, ఆమెకు అత్యంత సన్నిహితుడు రిచర్డ్ బేలే తాము చేయాల్సిందంతా చేశామని, ఇక ప్రజలు చేసే ప్రార్థనలే జయను కాపాడాలంటే ప్రకటించటంతో ఒక్కసారిగా ఉద్విగ్నవాతావరణం నెలకొంది. ఆ తరువాత తమిళ చానళ్లలో అమ్మ అస్తమించారంటూ వార్తలు రావటంతో అన్నాడిఎంకె కార్యకర్తలు ఆగ్రహంతో రెచ్చిపోయారు. తమ అమ్మను చూసేందుకు అనుమతించాలంటూ అపోలో ఆసుపత్రిలోకి దూసుకుపోయేందుకు ప్రయత్నించారు. దాడికి దిగారు. అక్కడ ఉన్న అద్దాలను పగుల గొట్టారు.... వాహనాలపైనా దాడి చేశారు. అయితే సిఆర్‌పిఎఫ్ జవాన్లు మోహరించి వారిని అడ్డుకున్నారు. మరోవైపు తమిళ టెలివిజన్ చానళ్ల ముందు అన్నాడిఎంకె కార్యకర్తలు ధర్నాలు చేశారు. తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారంటూ తీవ్రంగా నిరసనలు వ్యక్తం చేశారు. ఆ వార్తలన్నీ అబద్ధమని అపోలో మరో బులెటిన్ విడుదల చేయటంతో చానళ్లు తమ వార్తల్ని ఉపసంహరించుకున్నాయి. కానీ, అప్పటికే అభిమానులను ఈ వార్తాకథనాలు తీవ్ర భావోద్వేగాలకు గురిచేశాయి. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రి ప్రాంగణంలో అత్యంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో అపోలో పరిసర ప్రాంతాల్లో అన్ని మొబైల్ నెట్‌వర్క్‌లను బంద్ చేశారు. అపోలోతో పాటు చెన్నైలోని అన్ని ప్రధాన కూడళ్లలో పోలీసులను భారీగా మోహరించారు. విద్యాసంస్థలు, ఆఫీసులు, దుకాణాలు, డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లు అన్నీ మధ్యాహ్నంనుంచే స్వచ్ఛందంగా మూతపడటంతో నగరం ఒక్కసారిగా ఎడారిని తలపించింది. ఎక్కడ చూసినా, ఎవరిని కదిలించినా అమ్మ ఆరోగ్యం గురించే చర్చ సాగింది.ప్రధాన పుణ్యక్షేత్రాలయిన పళని, మదురై, రామేశ్వరం వంటి చోట్ల కూడా జనం బయటకు రాలేదు. టూరిస్టులు సైతం లేకపోవటంతో ఆలయాల్లో రద్దీ లేకుండా పోయింది. మదురై సమీపంలో దుండగులు ఒక బస్సును తగులబెట్టారు. పలు రైళ్లను రద్దు చేశారు. కొన్ని రైళ్లను మాత్రం కట్టుదిట్టమైన భద్రతతో నడిపించారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి రాకపోకలను కూడా నిలిపివేశారు.

చిత్రం..అపోలో ఆస్పత్రి గేటువద్ద భారీగా మోహరించిన పోలీసులు