జాతీయ వార్తలు

త్వరలో కొత్త వంద నోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 6: పెద్ద నోట్ల రద్దు తర్వాత రిజర్వ్ బ్యాంక్ మంగళవారం మరో కీలక ప్రకటన చేసింది. త్వరలో కొత్త వంద రూపాయల నోటును విడుదల చేయనున్నట్లు ఆర్‌బిఐ తెలిపింది. మహాత్మాగాంధీ సిరీస్-2005లో ఆర్‌బిఐ త్వరలో రూ. 100 కొత్త నోట్లను విడుదల చేస్తుందని, ఈ నోట్లలో ఇరువైపులా ఉండే నంబర్ ప్యానెల్స్ మధ్యలో ఎలాంటి లెటర్ ఉండదని ఆర్‌బిఐ ఒక ప్రకటనలో తెలిపింది. 2016 ముద్రణ సంవత్సరంగా ఉండే ఈ నోట్లు డిజైన్‌లో ఇప్పుడున్న పాతనోట్ల మాదిరిగానే ఉంటాయని, అయితే నంబర్ ప్యానెల్స్‌లోని అంకెలు ఆరోహణ క్రమంలో ఉంటాయని, బ్లీడింగ్ లైన్స్, ఐడెంటిఫికేషన్ మార్కు పెద్దగా ఉంటాయని ఆర్‌బిఐ ఆ ప్రకటనలో తెలిపింది. కొత్త నోట్లతో పాటుగా ఇప్పుడున్న పాత వంద రూపాయల నోట్లు కూడా చలామణిలో ఉంటాయని కూడా ఆర్‌బిఐ తెలిపింది.