జాతీయ వార్తలు

డిజిటల్ ఎకానమీపై 12నుంచి ప్రచారోద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: భారత్‌ను డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా చేయడంపై ప్రభుత్వం దృష్టిపెట్టిన నేపథ్యంలో నగదురహిత లావాదేవీలపై అవగాహన కల్పించడానికి నెలరోజుల పాటు ప్రచారోద్యమాన్ని చేపట్టాలని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి)దేశంలోని అన్ని యూనివర్శిటీలు, కాలేజిలను ఆదేశించింది. డిజిటల్ పేమెంట్లకు సంబంధించిన వివిధ పద్ధతులపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటుగా శిక్షణ ఇవ్వడానికి ఈ నెల 12నుంచి నెలరోజుల పాటు ప్రచారోద్యమాన్ని చేపట్టాలని యుజిసి విశ్వవిద్యాలయాలకు రాసిన ఒక లేఖలో కోరింది. ఈ ఉద్యమంలో ఉన్నత విద్యాసంస్థల్లోని యువకులు పాల్గొనడం ఎంతయినా సబబుగా ఉంటుందని, ఎందుకంటే డిజిటల్ ఎకానమీవల్ల ప్రధానంగా లబ్ధి పొందేది వారేనని ఆ లేఖలో యుజిసి పేర్కొంది.