జాతీయ వార్తలు

నగదు కొరతపై రష్యా నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: పెద్దనోట్ల రద్దు వ్యవహారం ఇటు ప్రజలకే కాకుండా అటు దౌత్యపరంగా దేశానికి కూడా ఇబ్బందులు కలిగిస్తోంది. నగదు కొరతతో తమ రాయబార కార్యాలయ విధులకు తీవ్ర విఘాతం కలుగుతోందని రష్యా నిరసన వ్యక్తం చేయడంతోపాటు అవసరమైతే ఈ విషయంలో ప్రతీకార చర్యకు దిగుతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. బ్యాంకు ఖాతాల నుంచి వారానికి 50 వేల రూపాయల కంటే ఎక్కువ నగదు విత్‌డ్రా చేయడానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వం విధించిన పరిమితి ‘చాలా తక్కువ’గా ఉండటంతో ఈ సొమ్ము ఎందుకూ సరిపోక తమ కార్యాలయంలో సాధారణ కార్యకలాపాలకు సైతం తీవ్ర విఘాతం కలుగుతోందని, కనుక ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని తమ దౌత్యాధికారులకు నగదు ఉపసంహరణపై పరిమితులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రష్యా రాయబారి అలెగ్జాండర్ కడాకిన్ విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఇఎ)కు లేఖ రాశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిబంధన ప్రకారం వారానికి 50వేల రూపాయల కంటే ఎక్కువ నగదును ఉపసంహరించుకునేందుకు వీల్లేదని, రిజర్వు బ్యాంకు నుంచి కొత్తగా ఏవైనా ఆదేశాలు వస్తే తప్ప ఈ విషయంలో ఎటువంటి మినహాయింపులూ ఉండబోవని రష్యా రాయబార కార్యాలయానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) స్పష్టం చేయడంతో ఆయన ఈ లేఖ రాశారు.