జాతీయ వార్తలు

సింగ్నాపూర్‌కు భక్తుల తాకిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మద్‌నగర్, ఏప్రిల్ 9: శని దేవునికి పూజలు చేయడానికి శనివారాన్ని పవిత్రమైన రోజుగా భావిస్తుంటారు. అందునా దేశంలోనే ప్రసిద్ధి గాంచిన మహారాష్టల్రోని సింగ్నాపూర్ గ్రామంలో గల శని దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధాన్ని తొలగించిన తరువాత వచ్చిన మొదటి శనివారం కావడంతో అనేకమంది పురుషులు, మహిళలు ఉదయమే పూజలు చేయడానికి ఆలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. పెద్దఎత్తున భక్తులు క్యూలైన్లలో నిలబడి తమ వంతు రాగానే పూజలు చేశారు. సుమారు 400 ఏళ్లుగా ఆలయ గర్భగుడిలోకి మహిళల ప్రవేశంపై కొనసాగుతున్న ఆంక్షలను ఆలయ ట్రస్టు శుక్రవారం నుంచి ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఆలయ ప్రవేశం విషయంలో లింగ వివక్షకు వ్యతిరేకంగా భూమాత బ్రిగేడ్ స్వచ్ఛంద సంస్థ ఆందోళన చేయడం, తరువాత మహారాష్ట్ర హైకోర్టు ఆలయాలలో స్ర్తి పురుష సమానత్వం పాటించాలని స్పష్టం చేసిన నేపథ్యంలో ట్రస్టు ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఆంక్షలు ఎత్తివేసిన వెంటనే కొంతమంది మహిళలు ఆలయంలోని గర్భగుడిలోకి ప్రవేశించి పూజలు చేశారు. భూమాత బ్రిగేడ్ నాయకురాలు తృప్తి దేశాయ్ కూడా శుక్రవారం తమ కార్యకర్తలతో కలిసివచ్చి పూజలు చేశారు. ఆంక్షలను ఎత్తివేయడంతో మహిళలు ఎంతో సంతోషంతో నల్లరాతి శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి, పూలు సమర్పించారు. శని, హనుమాన్ దేవుళ్లకు ప్రత్యేకించి శనివారం పూజలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. అందుకే దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ రెండు దేవుళ్ల విగ్రహాలు కలిసి ఏర్పాటు చేసి ఉన్నాయి.
హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ దేవాలయంలోని అన్ని గేట్లను తెరిచి భక్తులందరికీ ప్రవేశానికి అనుమతించినప్పటికీ, ఈ పరిణామంతో సింగ్నాపూర్ గ్రామస్థుల మనోబావాలు దెబ్బతిన్నాయని తాను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నట్లు సింగ్నాపూర్ సర్పంచ్ బాల్‌సాహెబ్ బాంకర్ అన్నారు.