జాతీయ వార్తలు

తీరు మారని లోక్‌సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఓటింగ్‌తో కూడిన చర్చ జరపాలని పట్టుపడుతున్న కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు గురువారం కూడా లోక్‌సభను స్తంభింపజేశాయి. కాంగ్రెస్, టిఎంపిసి, వామపక్షాలకు చెందిన సభ్యులు పోడియంను చుట్టముట్టి ఎన్‌డిఏ ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలిస్తూ లోక్‌సభను స్తంభింపజేశారు. లోక్‌సభ ఉదయం సమావేశం కాగానే స్పీకర్ సుమిత్రా ప్రతిపక్షం నినాదాల గొడవ, గందరగోళం మధ్యనే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించారు. 45 నిముషాల పాటు నిర్వహించిన అనంతరం 15 నిముషాల పాటు సభను వాయిదా వేశారు. ప్రతిపక్షం సభ్యులు పెద్ద నోట్ల రద్దువలన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించేందుకు సిద్ధమైతే వెంటనే ప్రారంభిస్తామని ఆమె పలుమార్లు చెప్పారు. చర్చకు ఒప్పుకోకుండా మాట్లాడేందుకు అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 12 గంటలకు తిరిగి సమావేశమైనప్పుడు ప్రభుత్వ పత్రాలను సభకు సమర్పింపజేసిన అనంతరం జీరో అవర్ చేపట్టారు. లోక్‌సభ రెండు గంటలకు సమావేశమైనప్పుడూ స్పీకర్ సుమిత్రా మహాజన్ పలువురు సభ్యుల సావధాన తీర్మానాలపై చర్చ జరిపిన అనంతరం అనుబంధ పద్దులను చర్చకు చేపట్టారు. అప్పటికే పోడియం వద్దకు దూసుకొచ్చిన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ గందరగోళం సృష్టించారు. ఆ తరువాత ఆమె సభను శుక్రవారానికి వాయిదా వేసి వెళ్లిపోయారు.