జాతీయ వార్తలు

తమిళనాట మొదలైన ఎన్నికల వేడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మార్చి 21: తమిళనాట రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయకాంత్ నేతృత్వంలోని డిఎండికెతో పొత్తుకు సంబంధించి ఆ పార్టీతో చర్చలు కొనసాగుతున్నాయని ప్రతిపక్ష డిఎంకె సోమవారం ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని విజయకాంత్ కొద్దిరోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. డిఎండికెతో చర్చలు కొనసాగుతున్నాయని, ఆ పార్టీ తమ పార్టీతో చేతులు కలుపుతుందనే విశ్వాసం తనకు ఉందని డిఎంకె అధినేత ఎం.కరుణానిధి సోమవారం ఇక్కడ విలేఖరులకు చెప్పారు. డిఎండికెతో పొత్తు పెట్టుకోవడానికి పట్టువదలకుండా ప్రయత్నిస్తున్న పార్టీల్లో డిఎంకె ఒకటి. డిఎంకెతో పాటు బిజెపి, నాలుగు పార్టీల కూటమి పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్.. డిఎండికెతో పొత్తుకు పట్టువదలకుండా ప్రయత్నిస్తున్నాయి. డిఎండికెతో చర్చలు కొనసాగుతున్నాయని కరుణానిధి చేసిన ప్రకటనతో అధికార ఎఐఎడిఎంకెను ఎదుర్కొనే ప్రతిపక్షాల రాజకీయ సమీకరణాల్లో స్పష్టత వస్తోంది. డిఎంకె ఇదివరకే కాంగ్రెస్‌తోపాటు ఐయుఎంఎల్, ఎంఎంకె పార్టీలతో ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది. డిఎండికెతో పొత్తు ఖరారు అంశాన్ని ఖచ్చితంగా ఎప్పుడు ప్రకటిస్తామనేది తాను ఇప్పుడే చెప్పలేనని కరుణానిధి అన్నారు. అయితే ఆ సమయం వస్తుందని ఆయన పేర్కొన్నారు. డిఎంకె ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనే అంశాన్ని కూడా తాను ఇప్పుడే చెప్పలేనని కరుణానిధి మరో ప్రశ్నకు బదులుగా చెప్పారు. ఎన్నికల ప్రచారాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారని ఒక విలేఖరి అడగ్గా, ప్రచారం అని అనడానికి స్వచ్ఛమైన తమిళ పదాన్ని వినియోగించిన ఆ జర్నలిస్టుకు కరుణానిధి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుమించి ఆయన ఏమీ చెప్పలేదు. అంతకుముందు కరుణానిధి తమిళనాడు, పుదుచ్చేరిలలోని వివిధ జిల్లాల డిఎంకె కార్యదర్శుల సమావేశానికి అధ్యక్షత వహించారు. పుదుచ్చేరిలో కూడా మే 16న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.