జాతీయ వార్తలు

ఈ కష్టాలు ఎంతోకాలం ఉండవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: అవినీతికి వ్యతిరేకంగా తాను చేస్తున్న యజ్ఞానికి దేశమంతా అండగా నిలిచినందుకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసి సరిగ్గా నెలరోజులైన సందర్భంగా గురువారం తన అభిప్రాయాలను ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ‘అవినీతికి, ఉగ్రవాదానికి, నల్లధనానికి వ్యతిరేకంగా నేను ప్రారంభించిన యజ్ఞానికి దేశప్రజలంతా వెన్నుదన్నుగా ఉన్నారు. వారందరికీ శాల్యూట్ చేస్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్య వల్ల కొంత వరకు అసౌకర్యం ఏర్పడుతుందని ముందే చెప్పానని అయితే ఇది స్వలకాలిక సమస్యేనని, దీర్ఘకాలంలో దేశ ప్రజలందరికీ మంచి ఫలితాలు ఉంటాయని మోదీ వ్యాఖ్యానించారు. ‘ మన గ్రామాల అభివృద్ధిని ఇక ఏ అవినీతి, నల్లధనం అడ్డుకోలేదు. మన గ్రామాలు తాము పోగొట్టుకున్నవి తిరిగి సాధించాల్సిందే’ అని ఆయన అన్నారు. ఆర్థిక లావాదేవీల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, నగదు రహిత చెల్లింపులను పెంచేందుకు చరిత్రాత్మక అవకాశం లభించిందని మోదీ వ్యాఖ్యానించారు. భారత దేశంలో అవినీతి, నల్లధనం నిర్మూలన చేసేందుకు డిజిటల్ చెల్లింపులకు మద్దతునివ్వాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. పెద్ద నోట్ల రద్దుపై విపక్షాలు ఎంతగా ఆందోళన చేస్తున్నప్పటికీ, భారత్ నల్లధనాన్ని ఓడించిందని ప్రపంచానికి చాటాలని మోదీ చెప్పారు. పేదలకు, నయా మధ్యతరగతి, మధ్య తరగతి వర్గాలకు సాధికారత కల్పించాలన్నదే తన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.