జాతీయ వార్తలు

అధికారపక్షం ట్రాప్‌లో పడిపోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: పెద్దనోట్ల రద్దు విషయంలో ప్రజలు పడుతున్న సమస్యలపై పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్ష పార్టీలకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, ప్రభుత్వం వేసిన ట్రాప్‌లో ప్రతిపక్ష పార్టీలు చిక్కుకున్నాయని, అందుకే నోట్ల రద్దు నిర్ణయంపై చర్చ జరగకుండా పార్లమెంట్‌ను అడ్డుకొంటున్నాయని అన్నారు. మిగిలిన రోజుల్లోనైన నోట్ల రద్దుపై చర్చ జరిగేలా చూడాలని ఉండవల్లి సూచించారు. నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను మీడియాద్యారా, చట్ట సభలద్యారా ప్రభుత్వానికి విన్నవించాలని ఎంపీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. డబ్బులుండి కూడా దరిద్రం అనుభవించాల్సిన పరిస్థితులు దేశంలో నెలకొన్నాయని ఆరోపించారు. నోట్ల రద్దు విషయంలో దిగువ, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారే తప్ప ధనవంతులకు ఎటువంటి కష్టం లేదని వివరించారు. నల్లధనాన్ని అంతం చేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి పేద ప్రజలు అల్లాడిపోతున్నారని ఆయన అన్నారు.