జాతీయ వార్తలు

మావోల నోట్లు మారుస్తూ పట్టుబడ్డ యువకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, డిసెంబర్ 8: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులకు చెందిన పెద్ద నోట్లను మారుస్తూ గురువారం ఓ యువకుడు అరెస్ట్ అయ్యాడు. దంతెవాడ జిల్లా భాంసీ పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు చేస్తుండగా ఓ యువకుడు అనుమానాస్పదంగా కన్పించాడు. అతనిని సోదా చేయగా వెయ్యి రూపాయల నోట్లు రూ.1.10 లక్షలు దొరికాయి. మావోయిస్టులకు చెందిన బ్యానర్లు, పోస్టర్లు కూడా లభ్యమయ్యాయి. వెంటనే అతన్ని విచారించగా మావోయిస్టులు ఈ పెద్దనోట్లను మార్చుకుని రమ్మని ఇచ్చినట్లుగా విచారణలో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాంకానార్ అటవీ ప్రాంతంలో గురువారం ఇద్దరు మావోయిస్టులను 85 సిఆర్‌పిఎఫ్ బెటాలియన్‌కు చెందిన జవాన్లు, జిల్లా పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో హేమ్లా లక్కుపై 8 వారెంట్లు, హేమ్లా రూపాపై 2 వారెంట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సుక్మా జిల్లాలో తోంగ్‌పాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 227 బెటాలియన్ సిఆర్‌పిఎఫ్ జవాన్లు, పోలీసులు కలిసి కూంబింగ్ నిర్వహించగా కాశీరాజ్ మార్గంలో 5 కి.మీల వ్యవధిలో మావోయిస్టులు అమర్చిన డిటోనేటర్లు, స్వాధీనం చేసుకున్నారు.