జాతీయ వార్తలు

సమతా ఎక్స్‌ప్రెస్ పేరు ఇకపై వైజాగ్ స్టీల్ సమతా ఎక్స్‌ప్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ విశాఖపట్నం (గాజువాక): డిసెంబర్ 8: విశాఖపట్నం నుండి ఢిల్లీ (హజారత్ నిజాముద్దీన్) వెళ్లే సమతా సూపర్ ఫాస్ట్ రైలు పేరును వైజాగ్ స్టీల్ సమతా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా గురువారం మార్పు చేశారు. ఈ మేరకు గురువారం నిజాముద్దీన్ రైల్వేస్టేషన్‌లో బయలుదేరిన వైజాగ్ స్టీల్ సమతా ఎక్స్‌ప్రెస్‌ను కేంద్ర ఉక్కుశాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్, రైల్వేశాఖ మంత్రి సురేష్ పి ప్రభు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కేంద్ర ఉక్కు మంత్రి సింగ్ మాట్లాడుతూ ఇటువంటి ప్రచార కార్యక్రమాలు సంస్థ మార్కెట్ పరిధిని మరంత విస్తరింపచేయడంలో కీలక భూమిక వహిస్తాయన్నారు. ప్రస్తుత మందగమన పరిస్థితిలో ప్రచారం ప్రభావంతంగా పని చేసి సంస్థ ఉత్పత్తులకు గ్రామాణ, పట్టణ మార్కెట్‌లో మంచి ఆదరణ లభిస్తుందన్నారు. దేశంలోని తలసరి ఉక్కు వినియోగం వృద్ధి చెందాల్సి ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో తలసరి ఉక్కు వినియోగం 61 కేజీలగా, ప్రపంచం స్థాయిలో 208 కేజీలగా ఉందన్నారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు మాట్లాడుతూ రైల్వే ద్వారా ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రచార సౌలభ్యాన్ని పొంద వచ్చునన్నారు. రైల్యే ద్వారా ప్రచారం చేసుకోవడం ద్వారా ఆ యా సంస్థ ఉత్పత్తులకు విడివిగా ప్రచారం జరుగుతుందన్నారు. ఉక్కు సిఎండి పి.మధుసూదనరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఉత్పత్తుల మార్కెట్‌ను మరంత పెంపొందించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

చిత్రం..వైజాగ్ స్టీల్ సమతా ఎక్స్‌ప్రెస్‌కు ఢిల్లీలో జెండా ఊపుతున్న కేంద్ర మంత్రులు