జాతీయ వార్తలు

అంతా మీ ఇష్టమేనా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: జాతీయ దర్యాప్తు సంస్థ సిబిఐ తాత్కాలిక డైరెక్టర్‌గా రాకేష్ ఆస్థానాను నియమించడంపై సుప్రీం కోర్టు శుక్రవారం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దేశాన్ని కుదిపేసిన 2జి స్పెక్ట్రం, బొగ్గు కుంభకోణం కేసు దర్యాప్తులను పర్యవేక్షించిన సీనియర్ అధికారి ఆర్‌కె దత్తాను పక్కనపెట్టి, తమ అనుమతి లేకుండా రాకేష్‌ను ఎలా నియమించారని కేంద్రాన్ని ప్రశ్నించింది.
రాకేష్ ఆస్థానా నియామకాన్ని కామన్‌కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. పిటిషన్‌ను విచారించిన జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్‌తో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అత్యంత సీనియర్ అధికారి దత్తాను ఎందుకు పక్కన బెట్టారు? తమ అనుమతి లేకుండా రాకేష్‌ను తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించారు? అని ధర్మాసనం ప్రశ్నించింది. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ సిబిఐ డైరెక్టర్ నియామకంపై సెలక్షన్ కమిటీతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామన్నారు. దీనిపై సుప్రీం కోర్టు, ప్రధాన ప్రతిపక్ష పార్టీనేతకు లేఖలు రాయనున్నట్టు ఆయన వివరించారు. నిబంధనలు ఉల్లంఘించి రాకేషన్‌ను తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించారని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. అత్యున్నత దర్యాప్తుసంస్థ సిబిఐను నిర్వీర్యం చేయడమేనని ఆయన అన్నారు.