జాతీయ వార్తలు

కాశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు లష్కరే తోయిబా మిలిటెంట్లు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, డిసెంబర్ 9: కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు లష్కరే తోయిబా మిలిటెంట్లు హతమైనారు. 36 గంటలుగా కొనసాగిన ఎన్‌కౌంటర్ శుక్రవారం ముగిసింది. కాగా, గురువారం శాంతిభద్రతల సమస్య సందర్భంగా గురితప్పిన బులెట్ ఒకటి తగిలి పౌరుడొకరు మృతి చెందాడు. ఇంటిలో దాగి ఉండిన ముగ్గురు మిలిటెంట్లను మట్టుబెట్టడం జరిగిందని, ఇద్దరు మిలిటెంట్ల మృతదేహాలను, మూడు ఆయుధాలను స్వాధీనం చేసకున్నట్లు ఆర్మీకి చెందిన నార్తర్న్ కమాండ్ ఒక ట్వీట్‌లో తెలియజేసింది.
అయితే శ్రీనగర్‌లోని 15 కోర్ ప్రధాన కార్యాలయానికి చెందిన అధికారులు మాత్రం దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. మిలిటెంట్లు దాగి ఉండిన ఇంటి శిథిలాల కిందినుంచి ఇద్దరు మిలిటెంట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఒక పోలీసు అధికారి చెప్పారు. చనిపోయిన ఇద్దరు మిలిటెంట్లు కూడా స్థానికులేనని, వారిని కుల్గాం జిల్లాలోని కొయిమోకు చెందిన మజీద్ మొహియుద్దీన్ జర్గార్, అనంత్‌నాగ్ జిల్లా వెస్సుకు చెందిన రుహుల్ అమిన్ దార్‌గా గుర్తించినట్లు ఆయన చెప్పారు. మృతదేహాలను అంత్యక్రియలకోసం వారి బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. మృతదేహాల్లో ఒకటి బాగా కాలిపోయిందని కూడా ఆయన చెప్పారు. గురువారం తెల్లవారుజామున ప్రారంభమైన పోరులో ఒక ఆర్మీ జవాను కూడా గాయపడ్డాడు. లష్కరే తోయిబాకు చెందిన మిలిటెంట్లు దాగి ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు బుధవారం సాయంత్రం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఇదిలా ఉండగా ఎన్‌కౌంటర్ జరిగిన స్థలానికి దగ్గర్లో రాళ్లు రువ్వుతున్న జనాలను చెదరగొట్టడానికి భద్రతాదళాలు కాల్పులు జరిపినప్పుడు గురి తప్పిన బులెట్ ఒకటి తగిలి 24 ఏళ్ల పౌరుడొకరు గురువారం చనిపోయాడు.