జాతీయ వార్తలు

భారత్ మాతకు జై కొట్టడాన్ని గర్వంగా భావిస్తా: ఖేర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూణే, ఏప్రిల్ 9: భారత్ మాతాకీ జై అనడాన్ని తానెంతో గర్వంగా భావిస్తానని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ స్పష్టం చేశారు. మాతృదేశాన్ని గౌరవించడం అంటే ఏదో ఘోరం జరిగిపోయినట్టు వ్యాఖ్యానించడం, దాన్నొక సమస్యగా సృష్టించడం దారుణమని శనివారం ఇక్కడ చెప్పారు. ‘జిటో-2016’ పేరుతో జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవపట్టించే పోకడలు మంచిదికాదని హితవుచెప్పారు. ‘వివాదాస్పద కార్యక్రమాలు ప్రసారం చేసే టివి చానళ్లను చూడొద్దు. అలాంటి చానళ్లను స్విచాఫ్ చేయండి. వాస్తవాలు ప్రసారం చేసే దూరదర్శన్‌ను వీక్షించండి’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. అరవై ఏళ్లుగా దేశం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంటే వాటి జోలికి వెళ్లకుండా ‘్భరత్ మాతాకీ జై’పై రాద్ధాంతం చేస్తున్నారని పద్మవిభూషణ్ అవార్డు గృహీత స్పష్టం చేశారు. తనమెడపై కత్తిపెట్టినా భారత్ మాతాకీ జై అననని ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై ఖేర్ పరోక్ష దాడి చేశారు. రాజ్యాంగంలో ఎక్కడా లిఖించలేదు కాబట్టి భారత్‌కు జై కొట్టాల్సిన అవసరం లేదని కొందరు వక్రభాష్యం పలుకుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. అయితే ఆ నినాదం ఇవ్వడం తాను గర్వంగా భావిస్తానని ఆయన పునరుద్ఘాటించారు.