జాతీయ వార్తలు

ఇప్పుడేమీ చెప్పలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, డిసెంబర్ 9: తమిళనాడు మాజీ ముఖ్యమత్రి, అన్నా డిఎంకె అధినేత్రి జె.జయలలిత మరణం తర్వాత ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నప్పటికీ ఎఐఎడిఎంకెకి, తమ పార్టీకి మధ్య పొత్తు గురించి ఇప్పుడే చర్చించడం ‘చాలా తొందరపాటు’ అవుతుందని బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ఎం.వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ‘మేడమ్ (జయలలిత) అంత్యక్రియలు ఇప్పుడే పూర్తయినందున ఎఐఎడిఎంకె-బిజెపి మధ్య పొత్తుకు సంబంధించి ఇప్పుడు ఏమి మాట్లాడినా చాలా తొందరపాటే అవుతుంది. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ పొందిక గానీ, పునఃపొందిక గానీ జరగడంలేదు. కనుక మమ్మల్ని కొంత కాలం పాటు వేచి చూడనివ్వండి’ అని వెంకయ్య నాయడు శుక్రవారం బెంగళూరులో విలేఖరులతో అన్నారు. జయలలిత మరణం తర్వాత తమిళనాడులో తీవ్రమైన రాజకీయ శూన్యత ఏర్పడినందున ఆ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం, బిజెపి పోషించే పాత్ర ఏమిటని విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. ఎఐఎడిఎంకె తమకు సహజమైన మిత్రపక్షమని అభివర్ణించడం ద్వారా ఆ పార్టీ ఎన్‌డిఎలో చేరుతుందని మీరు చెబుతున్నారా? అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు వెంకయ్య నాయుడు సమాధానమిస్తూ, ‘సహజ’మనే పదాన్ని తమ మీడియా మీత్రులు ఉపయోగించారని, అంతేతప్ప తాను ఆ మాట అనలేదని, సైద్ధాంతికంగా ఎఐఎడిఎంకెకి, బిజెపికి మధ్య కొంత మేర సారూప్యత ఉందని మాత్రమే చెప్పానని తెలిపారు.