జాతీయ వార్తలు

తోకముడిచిన ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చకు సిద్ధమని చెబుతూ వచ్చిన ప్రభుత్వం శుక్రవారం తోకముడించింది. నిబంధనలతో సంబంధం లేకుండా చర్చకు సిద్ధమని విపక్షం ప్రకటించగా ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ 16 రోజులు చర్చ జరగుకండా అడ్డుకున్నందుకు ప్రతిపక్షమే మొదట క్షమాపణలు చెప్పాలంటూ గందరగోళం సృష్టంచి సభ వాయిదా పడేలా చేసింది. లోక్‌సభ శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈదశలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే లేచి పెద్ద నోట్ల రద్దుపై వెంటనే చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు మాత్రం ఓటింగ్‌తో కూడిన చర్చ జరపాలంటూ పోడి యం వద్ద నినాదాలు ఇస్తూ సభను స్తంభింపజేశారు. అధికార పక్ష సభ్యుడు ప్రహ్లాద్ పటేల్ లేచి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చీవాట్లు పెట్టడంతో కాంగ్రెస్ ఇప్పుడు నియమాలతో సంబంధం లేకుండా చర్చకు డిమాండ్ చేస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షం సభ్యులంతా పోడియంను చుట్టుముట్టి సభ దద్దరిల్లేలా నినాదాలు ఇచ్చారు. దీంతో సుమిత్రా మహాజన్ సభను 11.30 వరకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశం కాగానే ఆమె ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ప్రయత్నించారు. ఈ దశలో మల్లిఖార్జున ఖర్గే లేచి పెద్దనోట్ల రద్దుపై వెంటనే చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రజలు కడుతున్న కష్టాలపై వెంటనే చర్చ ప్రారంభించాలన్నారు. బిజెపి సభ్యురాలు మీనాక్షీ లేఖి వ్యాఖ్యలు గొడవకు ఆజ్యం పోశాయి. అప్పటికే పోడియం వద్దకు వచ్చిన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల సభ్యుల పెద్ద ఎత్తున నినాదాలు ఇవ్వటంతో సభ దద్దరిల్లిపోయింది. దీంతో సుమిత్రా మహాజన్ రెండు నిమిషాల్లోనే సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. లోక్‌సభ మధ్యా హ్నం 12 గంటలకు తిరిగి సమావేశం కాగానే స్పీకర్ మొదట ప్రభుత్వ పత్రాలను సభకు సమర్పింపజేశారు. ఆ తరువాత ఆమె జీరో అవర్ కార్యక్రమం చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే పోడియం వద్దకు దూసుకు వచ్చిన కాంగ్రెస్, తృణమూ ల్ కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు తమ నినాదాలతో సభను స్తంభింపజేశారు. పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో సభ సజావుగా సాగలేదు. 16 రోజుల నుంచి సభను స్తంభింపజేసినందుకు ప్రతిపక్షం మొదట క్షమాపణలు చెప్పాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ డిమాండ్ చేశారు. మళ్లీ అధికార, ప్రతిపక్ష సభ్యుల వాదనతో సభ దద్దరిల్లిపోయింది. ఈ పరిస్థితుల్లో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను బుధవారం వరకు వాయిదా వేశారు.

చిత్రం..లోక్‌సభలో శుక్రవారం మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకుడు మల్లిఖార్జున్ ఖర్గే