జాతీయ వార్తలు

రూటు మార్చిన ప్రతిపక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి రోజూ పెద్దనోట్ల రద్దుపై రాజ్యసభలో గొడవ చేసిన ప్రతిపక్షం శుక్రవారం రూటు మార్చింది. గోధుమల దిగుమతిపై సుంకాన్ని పూర్తిగా తొలగించడం ద్వారా ఎన్‌డిఏ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దెబ్బ తీసిందంటూ ప్రతిపక్షం శుక్రవారం రాజ్యసభను స్తంభింపజేసింది. సిపిఎంతోపాటు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, జెడియు తదితర ప్రతిపక్షాలు గోధుమల దిగుమతిపై సుంకాన్ని తొలగించడాన్ని తీవ్రంగా ఖండించాయి. దేశంలోని గోధుమ రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని ప్రభుత్వంపై ఆరోపణలు కురిపించారు. దీనిపై సిపిఎం పక్షనేత సీతారాం ఏచూరి 267 నియమం కింద నోటీసు ఇచ్చారు. ప్రభుత్వం గోధుమలపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా తొలగించటం సిగ్గు చేటని జీరో అవర్‌లో ఏచూరి దుయ్యబట్టారు. దేశంలో హరిత విప్లవం సాధించటంతోపాటు ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధిని సాధించిన 50 ఏళ్ల తరువాత విదేశాల నుంచి గోధుమలు సుంకం లేకుండా దిగుమతి చేసుకునే దురదృష్టపరిస్థితులు నెలకొనటం సిగ్గు చేటని ఆయన విమర్శించారు. బహుళజాతి సంస్థలు లాభపడేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన విరుచుకుపడ్డారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గోధుమ దిగుమతిపై సుంకాన్ని తొలగించటం అత్యంత తీవ్రమైన విషయమన్నారు. ‘పెద్ద నోట్ల రద్దు ద్వారా రైతులు పంటలు పండించకుండా చేశారు. వ్యవసాయ రంగానికి కోలుకోలేని దెబ్బ. 500, 1000 రూపాయల నోట్ల రద్దు వల్ల పంటలు పండక ఆకలి దాడులు జరుగుతాయనే భయంతోనే ఎన్‌డిఏ ప్రభుత్వం గోధుమల దిగుమతికి అనుమతి ఇచ్చింది’అని ఆయన ఆరోపించారు.సీతారాం ఏచూరి మాట్లాడుతున్నంత సేపూ అధికారపక్ష సభ్యులు తమ సీట్లో నిలబడి గొడవ చేస్తునే ఉన్నారు. అధికారపక్ష తీరుపై కాంగ్రెస్ పక్ష ఉప నాయకుడు ఆనంద శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏచూరి అనుమతితో మాట్లాడుతుంటే గొడవ చేయడమేమిటని ఆయన నిలదీశారు. కేంద్రం గోధుమలను దిగుమతి చేసుకుంటే స్థానంగా పండిన వాటిని ఎవరు కొంటారని రేవతిరమణ సింగ్ ప్రశ్నించారు. సుంకాన్ని తొలగించడం ద్వారా ప్రభుత్వం దేశంలోని గోధుమ రైతులను చావుదెబ్బ తీసిందని బిఎస్‌పి అధినేత్రి మాయావతి నిప్పులు చెరిగారు. కాగా ధరలు పెరిగే అవకాశం ఉన్నందునే ముందు జాగ్రత్త చర్యగా గోధుమలు దిగుమతి చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నామని ఎరువురు, ప్రజాపంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ వివరించారు. పెద్దనోట్ల రద్దు మూలంగా ఆహార ధాన్యాల ధరలు బాగా పడిపోయాయని జెడియు సీనియర్ నాయకుడు శరద్ యాదవ్ చెప్పారు. దేశంలోనే గోధుమ నిల్వలు ఉండగా దిగుమతి చేసుకోవడం ఎందుకని కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేష్ నిలదీశారు. నోట్ల కోసం క్యూలో నిలబడి మరణించిన వారికి సభ శ్రద్ధాంజలి ఘటిస్తుందా? అని టిఎంసి సభ్యుడు సుఖేందురాయ్ ప్రశ్నించారు. సభను నిర్వహించాలని జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ డిమాండ్ చేయగా ఇది జీరో అవర్ అనేది మరిచిపోరాదని ఉపాధ్యక్షుడు కురియన్ ఆమెకు సూచించారు. రైతుల ప్రయోజనాలను దెబ్బ తినకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పరుషోత్తం రూపాల హామీ ఇచ్చినా ప్రతిపక్షం పట్టించుకోలేదు. దీంతో సభ వాయిదా పడింది. తిరిగి సమావేశమైనప్పుడు కూడా పరిస్థితిలో మార్పులేదు. తిరిగి సమావేశమైనప్పుడు విపక్షం పోడి యం వద్దకు వచ్చి గొడవ చేయడంతో చైర్మన్ హమీద్ అన్నారీ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టలేకపోయారు. సభ పూర్తిగా స్తంభించిపోయింది. రాజ్యసభ రెండున్నరకు తిరిగి సమావేశమైనప్పడు కోరం లేకపోవటంతో బుధవారానికి వాయిదా పడింది.

చిత్రాలు..రాజ్యసభలో శుక్రవారం నాటి దృశ్యాలు ఇవి..
మొదటి ఫొటో సభ్యుల నినాదాలకు సంబంధించినది అయతే, రెండోది కనీస సభ్యులు లేని దృశ్యం