జాతీయ వార్తలు

చట్టబద్ధత ఏమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: రాష్ట్ర విభజన చట్టం కింద ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్యాకేజీకి వీలున్నంత త్వరగా చట్టబద్ధత కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరినట్లు తెలిసింది. ఆయన శుక్రవారం జైట్లీతో సమావేశమై రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన ప్యాకేజీతోపాటు ఇతర ప్రాజెక్టుల అమలు గురించి చర్చించారు. రాష్ట్రానికి కేటాయించవలసిన నిధులు, విడుదల చేయవలసిన బకాయిల గురించి కూడా జైట్లీతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు మూలంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను కూడా కేంద్ర మంత్రి ముందు ఏకరువు పెట్టినట్టు తెలిసింది. అవినీతి, నల్లధనాన్ని అదుపు చేసేందుకు మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నా కొత్త నోట్ల పంపిణీలో చోటుచేసుకున్న అవకతవకల వల్ల ముఖ్యం గా గ్రామీణ ప్రాంతాల ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారని చంద్రబాబు ఆయనకు వివరించారని తెలిసింది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుండి అందవలసిన నిధులు, నిర్మాణం పనుల తీరు తెన్నుల గురించి జైట్లీతో చంద్రబాబు చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు ఇటీవల నాబార్డ్ నిధులు అందటం తెలిసిందే.
పెద్ద నోట్లరద్దు అనంతరం కొత్త నోట్ల పంపిణీని మరింత పకడ్బందీగా చేస్తే బాగుండేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆదాయం పన్ను శాఖ, ఇతర నియంత్రణ వ్యవస్థలు పని చేశాయి కాబట్టి కొత్త నోట్ల పంపిణీలోని లోపాలు వెలుగులోకి వచ్చాయన్నారు. వ్యవస్థను మరింత పటిష్ఠం చేయవలసిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి సూచించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం గురించి తనకు ముందే తెలుసుననే ఆరోపణలను ఆయన ఖండించారు. సమాజంలో పారద్శకత ఉండాలన్నారు. రెండు వేల రూపాయలను కొనసాగించకూడదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. డిజిటల్ నగదు, ఫిజికల్ నగదుకు మధ్య వ్యత్యాసం ఉండాలన్నారు. ఆర్‌బిఐ, ఇతర బ్యాంకుల్లో టెక్నాలజీ పూర్తి స్థాయిలో రావలసి ఉన్నదన్నారు. ఎన్‌డిఏ ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు వలన ఎదురవుతున్న సమస్యలను మీరు భుజాన వేసుకున్నారనే మాట వినిపిస్తోందని ఒక విలేఖరి ప్రశ్నించగా అది నిజం కాదన్నారు. తన నాయకత్వంలోని కమిటీ ప్రజా సమస్యలను నివారించేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. పార్లమెంటులో పెద్ద నోట్ల రద్దుపై చర్చ జరపకుండా ప్రతిపక్షాలు తప్పు చేస్తున్నాయని విమర్శించారు. పెద్ద నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురు కావటం సహజమని ఆయన అభిప్రాయపడ్డారు.