జాతీయ వార్తలు

త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: పెద్ద నోట్ల రద్దుపై గొడవ చల్లారకముందే త్వరలోనే ప్లాస్టిక్ కరెన్సీని ముద్రించనున్నట్లు కేంద్రం తెలియజేసింది. ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ముద్రించాలనే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని, దీనికి సంబంధించిన మెటీరియల్‌ను సేకరించడం కూడా ప్రారంభమయిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ శుక్రవారం లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలియజేవారు. పది రూపాయల విలువ కలిగిన బిలియన్ (వందకోట్ల) ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం 2014 ఫిబ్రవరిలో పార్లమెంటులో ప్రకటించింది. కోచ్చి, మైసూరు, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్‌లలో వీటిని ప్రయోగాత్మకంగా ఈ ప్లాస్టిక్ నోట్లను వినియోగించాలని కూడా నిర్ణయించింది. ఈ దిశగా చర్యలు ప్రారంభమైనట్లు మంత్రి చెప్పారు. ప్లాస్టిక్ నోట్ల సగటు జీవితకాలం అయిదేళ్లుగా ఉంటుందని, వీటికి నకిలీ తయారు చేయడం అసలు సాధ్యం కాదని కూడా మంత్రి తెలిపారు. అంతేకాదు ఈ నోట్లు కాగితం నోట్లకన్నా పరిశుభ్రంగా ఉంటాయి. తొలుత ఆస్ట్రేలియాలో ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టడం జరిగింది. కాగా, సెక్యూరిటీ త్రెడ్ లేకుండా నాసిక్‌లోని కరెన్సీ నోట్ల ప్రెస్‌లో ముద్రించిన కొన్ని వెయ్యి రూపాయల నోట్లు వెనక్కి వచ్చినట్లు మరో ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి తెలిపారు. దీనిపై దర్యాప్తుకు ఆదేశించినట్లు కూడా ఆయన చెప్పారు.