తెలంగాణ

అసెంబ్లీ రికార్డులు తారుమారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రడూన్, ఏప్రిల్ 9: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ అసెంబ్లీ రికార్డులు తారుమారు చేశారని బిజెపి ఆరోపించింది. రికార్డులు తిప్పి రాయించడం లేదా తారుమారు చేసిన ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని పార్టీ డిమాండ్ చేసింది. రావత్ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ ‘సేవ్ ఉత్తరాఖండ్’ యాత్ర ప్రారంభించనున్నట్టు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు అజయ్ భట్ వెల్లడించారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ‘హరీశ్ రావత్, స్పీకర్ గోవింద్ సింగ్ కుమ్మక్కై రికార్డులు తారుమారు చేశారు. సిఎం సంక్షోభంలో పడ్డ మార్చి 18న రాత్రి స్పీకర్ చాంబర్‌లో ఇదంతా జరిగింది. అసెంబ్లీ కార్యకలాపాల రికార్డులు విచ్చలివిడిగా మార్చేశారు’ అని సింగ్ ఆరోపించారు. రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించి అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సభ్యుల ఓటింగ్‌తో నిమిత్తం లేకుండా బిల్లులకు స్పీకర్ ఆమోదం తెలపడంపై బిజెపి విరుచుకుపడింది. అసమర్ధపాలనతో ఇబ్బందులకు గురిచేసిన రావత్ పాదయాత్రల పేరుతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అజయ్ విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన నేతలే నీతులు వల్లిస్తున్నారని, రావత్‌కు అసలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కులేదని బిజెపి పేర్కోంది. రావత్ వైఫల్యాలను ఎండగడుతూ వచ్చేవారం సేవ్ ఉత్తరాఖండ్ యాత్ర ప్రారంభించనున్నట్టు అజయ్ సింగ్ ప్రకటించారు.