జాతీయ వార్తలు

నాలుగేళ్లుగా పనిచేయని చెరుకుపల్లి కృషి విజ్ఞాన్ కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబరు 9: ఏపిలో కృషి విజ్ఞాన కేంద్రాలు 23 ఉన్నాయని, అందులో 17 వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నట్టు కేంద్రం తెలిపింది. 1991 మంజూరు చేసిన గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం 2012 నుంచి పనిచేయడం లేదని కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి పురుషోత్తమ్ రూపాల తెలిపారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజ్యసభలో ఏపిలో కృషి విజ్ఞాన కేంద్రాల పని తీరుపై అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ఉద్యాన మిషన్‌లో భాగంగా ఏపి,తెలంగాణ రాష్ట్రాలలో తొమ్మిది జిల్లాలలో విస్తరించివుందని కేంద్రం తెలిపింది. పువ్వులు,కూరగాయలు,సుగంధ మొక్కలు, కొబ్బరి,జీడి,కోకో పంటలకు ముఖ్యంగా పంట దిగుబడి, నిర్వహణ,ప్రాసెసింగ్, మార్కెటింగ్‌లాంటి అంశాలు రైతులకు ఉపయోగపడే విధంగా ఈ పథకం ఉపయోగడుతుందని కేంద్ర వ్యవసాయమంత్రి తెలిపారు.