జాతీయ వార్తలు

ఆస్ట్రేలియాతో కీలక ఒప్పందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: విద్య, వ్యవసాయం, గనులు, సాంకేతికత తదితర రంగాల్లో కలిసి పని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెస్టర్న్ ఆస్ట్రేలియా ప్రభుత్వంతో పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఏపి భవన్‌లో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఢిల్లీలో ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్, వెస్టర్న్ ఆస్ట్రేలియా ప్రభుత్వ కోశాధికారి మైక్ నెహాన్ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. వెస్టర్న్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయంతో కూడా ఒక ఎంఓయు చేసుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. గనుల విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నదన్నారు. ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, నర్సింగ్ కాలేజీల అభివృద్ధికి ఎంఓయు వీలు కల్పిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. నైపుణ్య అభివృద్ధికి కూడా సాంకేతిక పరిజ్ఞానం తీసుకుంటామనీ, సహజవాయువులు, యురేనియం వెలికితీత, ఓడరేవుల అభివృద్ధి రంగాల్లో వెస్టర్న్ ఆస్ట్రేలియాతో కలిసి పనిచేస్తామని తెలిపారు. కాగా ఓటుకు నోటు కేసులో రాష్ట్ర హైకోర్టులో తనకు ఊరట లభించిన విషయంపై మాట్లాడేందుకు చంద్రబాబు నిరాకరించారు. ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

చిత్రం..ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆస్ట్రేలియా ప్రభుత్వంతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్న ఏపి అధికారులు