జాతీయ వార్తలు

సమాజ్‌వాదీ పార్టీలో మళ్లీ లుకలుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, డిసెంబర్ 11: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలకోసం ఆ రాష్ట్ర సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు శివ్‌పాల్ యాదవ్ విడుదల చేసిన అభ్యర్థుల జాబితా అధికార పార్టీలోని లుకలుకలను మరోసారి తెర మీదికి తీసుకొచ్చింది. రాజకీయ నాయకుడిగా మారిన గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీ సోదరుడితోపాటు మరో మాఫియా డాన్ అతీక్ అహ్మద్ లాంటి వారికి ఈ జాబితాలో చోటు కల్పించడాన్ని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతుండటమే ఇందుకు కారణం. మొత్తం 23 మంది అభ్యర్థులతో విడుదల చేసిన ఈ జాబితాలో అన్సారీ సోదరుడు, ఘాజీపూర్‌లోని మొహమ్మదాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న క్వామీ ఏక్తా దళ్ (క్యుఇడి) సిట్టింగ్ ఎమ్మెల్యే సిగ్బతుల్లా అన్సారీని మళ్లీ అదే నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఇవ్వడం చూస్తుంటే ఈ జాబితాపై శివ్‌పాల్‌తోపాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ముద్ర ఉన్నట్లు స్పష్టమవుతోంది. సమాజ్‌వాదీ పార్టీలో క్వామీ ఏక్తా దళ్ విలీనాన్ని అఖిలేష్ యాదవ్ బాహాటంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. దీంతో అది రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు మూల కారణమైంది. కాగా, శనివారం విడుదల చేసిన సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్ధుల జాబితాలో మాఫియా డాన్ అతీక్ అహ్మద్‌కు చోటు కల్పించడం కూడా వివాదాస్పదంగా మారింది. కాన్పూర్ కంటోనె్మంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగబోతున్న అతీక్ అహ్మద్ బిఎస్‌పి ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. అఖిలేష్ యాదవ్ బ్లాక్‌లిస్టులో పెట్టిన అతీక్‌కు ఈ జాబితాలో చోటు కల్పించడం సిఎంతోపాటు ఆయన అనుచరులకు ఏమాత్రం మింగుడు పడటం లేదు. పూల్‌పూర్ నుంచి గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన అతీక్ 1999 నుంచి 2003 వరకు అప్నా దళ్ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరించారు.