జాతీయ వార్తలు

బ్లాక్‌మెయిల్ రాజకీయాలు సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: నోట్ల రద్దుపై పార్లమెంటులో మాట్లాడడానికి ప్రతిపక్షాలు తనకు అవకాశమివ్వడం లేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను బిఎస్పీ అధినేత్రి మాయావతి ఆదివారం తీవ్రంగా తప్పుబడుతూ, లోక్‌సభలో పూర్తి మెజారిటీ ఉన్న పార్టీ నాయకుడిగా ఆయన అలాంటి ఆరోపణలు చేయడం సరికాదని, భావోద్వేగాలను రెచ్చగొట్టి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడే ఆయన ధోరణి ఏ మాత్రం పని చేయదని అన్నారు. అంతేకాదు ప్రధాని ధోరణి గురివింద సామెతను గుర్తు తెస్తోందని ఆమె అన్నారు. ‘లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీ ఉన్న పార్టీ నాయకుడు అలాంటి ఆరోపణలు చేయడం సరికాదు. ఇది ‘దొంగే పోలీసును దొంగ.. దొంగ అన్నట్లుగా ఉంది’ అని మాయావతి ఒక ప్రకటనలో అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జవాబుదారీతనం, బాధ్యలనుంచి పారిపోతున్నారని ఆమె అన్నారు. ‘పార్లమెంటు లోపల, బయట ప్రజల సమస్యలను వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అందుకే సమస్య సంక్లిష్టంగా మారుతోంది. ఆయన భావోద్వేగాలను రెచ్చగొట్టి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు. అయితే అది బిజెపికి కానీ, ప్రభుత్వానికి కానీ ఏమీ ఉపయోగపడదు’ అని అన్నారు. నోట్ల రద్దు దేశంలోని 90 శాతం మంది నిజాయితీపరులకు సమస్యగా తయారైందని ఆమె అన్నారు. బహ్రెచ్‌లో ఆదివారం బిజెపి పరివర్తన్ ర్యాలీలో మోదీ చేసిన ప్రసంగం, గుజరాత్‌లో ఆయన శనివారం చేసిన ప్రసంగం ఒకే మాదిరిగా ఉన్నాయని మాయావతి అన్నారు. ప్రజలు తిరస్కరించిన పార్టీలు వాస్తవాలను తొక్కి పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని యుపిలోని బహ్రెచ్‌లో జరిగిన బిజెపి ర్యాలీనుద్దేశించి చేసిన ప్రసంగంలో మోదీ ఆరోపించడం తెలిసిందే. అంతేకాదు బిఎస్పీ, ఎస్పీలు రెండూ కూడా నోట్ల రద్దుపై ఒకే విధంగా మాట్లాడుతున్నాయని కూడా ప్రధాని అన్నారు.