జాతీయ వార్తలు

మిలాద్ ఉన్ నబీకి రాష్టప్రతి శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లింలు పవిత్రంగా జరుపుకునే మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీలు దేశ ప్రజలకు తమ శుభాకాంక్షలు తెలిపారు. విశ్వమానవ సౌభ్రాతృత్వానికి, సహనానికి మహమ్మద్ ప్రవక్త సందేశాలు ఆచరణీయమని వారన్నారు. ‘‘మహమ్మద్ ప్రవక్త పవిత్రమైన జన్మదినం సందర్భంగా దేశ ప్రజలకు, ప్రపంచంలోని భారతీయులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహమ్మద్ ప్రవక్త సేవలు మనందరికీ ప్రేరణ కలిగించేవి’’ అని రాష్టప్రతి పేర్కొన్నారు. ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ తన సందేశంలో మహమ్మద్ ప్రవక్త మానవత్వానికి సరైన మార్గనిర్దేశం చేశారని పేర్కొన్నారు.