జాతీయ వార్తలు

పార్టీని నడపడానికి శశికళే తగిన వ్యక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 11: ఎఐఎడిఎంకె పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని శశికళ చేపట్టాలనే అభిప్రాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒ.పన్నీర్ సెల్వం వ్యక్తం చేసిన మరుసటి రోజే ఆ పార్టీ నాయకుడు, లోక్‌సభలో డిప్యూటి స్పీకర్ ఎం.తంబిదురై కూడా ఆమెకు మద్దతు పలికారు. ఎఐఎడిఎంకె పార్టీని భవిష్యత్తులో ముందుకు నడపడానికి శశికళ తగిన వ్యక్తి అని ఆయన పేర్కొన్నారు. పార్టీ దివంగత ముఖ్యమంత్రి జయలలితకు విశ్వాసపాత్రురాలయిన వ్యక్తి శశికళ అనే విషయం అందరికీ తెలిసిందేనని ఆయన అన్నారు. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలలో గతంలో జయలలితకు శశికళ సలహాలు ఇచ్చేవారని ఆయన వెల్లడించారు. పార్టీ పగ్గాలను చేపట్టాలని ఆయన శశికళను కోరారు. 3ఇప్పుడు గౌరవనీయురాలయిన అమ్మ (జయలలిత) మన మధ్యలో లేరు. ఎఐఎడిఎంకెను ముందుకు నడిపించే సామర్థ్యం, చాతుర్యం, అనుభవం ఉన్న వ్యక్తి ఒక్క చిన్నమ్మ (శశికళ) మాత్ర మే2 అని ఆయన పేర్కొన్నారు. శశికళ గత 35 సం వత్సరాలు జయలలిత సహవాసిగా ఉన్నారని, అనేక త్యాగాలు చేశారని ఆయన అన్నారు. 3ప్రతీకార రాజకీయాల కారణంగా చిన్నమ్మ తప్పుడు కేసుల్లో ఇరుక్కున్నారు. ఆమె జైలుకు కూడా వెళ్లారు. అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. అలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడంలో ఆమె అమ్మకు రక్షణగా ఉన్నారు. అని పార్టీ ప్రచార కార్యదర్శి కూడా అయిన తంబిదురై ఒక ప్రకటనలో పేర్కొన్నారు.