జాతీయ వార్తలు

ఇడి లేదా ఆర్‌బిఐని ఆశ్రయించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: కేంద్రమంత్రి సుజనా చౌదరికి చెందిన సుజనా గ్రూప్ సంస్థలో అవకతవకలపై సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పిటిషనర్ ఉపసంహరించుకున్నారు. ఇలాంటి అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆర్‌బిఐ వంటి ఏదైనా దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. వినోద్ కుమార్ అనే వ్యక్తి సుజనా గ్రూప్ సంస్థల్లో రూ. 7,602 కోట్ల అక్రమాలు జరిగాయని వీటిపై పూర్తిస్థాయిలో విచారణ జరపడానికి వీలుగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటుచేసి విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో పిల్‌ను దాఖలు చేశారు. సోమవారం ఈ పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్.్ఠకూర్ నేతృత్వంలో న్యాయమూర్తులు ఆర్.్భనుమతి, ఉదయ్ ఉమేశ్ లతిత్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. సుజనాచౌదరి గ్రూప్ సంస్థలలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, సిట్‌తో దర్యాప్తు జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది హరీన్ రావల్ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్.్ఠకూర్ స్పందిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను గాని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను గానీ సంప్రదించాలని, ఇలాంటి వ్యవహారాలపై సరైన ఫోరం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఇలాంటి విషయాలను వారికి తెలపాలని, ఆ తరువాత అవసరం అయితే న్యాయస్థానానికి రావాలన్నారు. దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది హరీన్ రావల్ ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించాలని ధర్మాసనాన్ని కోరారు. దీంతో సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అంగీకరించింది.