జాతీయ వార్తలు

కఠిన నిర్ణయాలు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: ఎన్నికల ఖర్చును అదుపు చేసేందుకు కఠిన నిబంధనలను అమలు చేయవలసిన అవసరం ఉన్నదని, ఎన్నికలకోసం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించటాన్ని తీవ్రంగా పరిగణించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. సమకాలీన శాసన వ్యవస్థకు అనుగుణంగా అవసరమైన మార్పులు చేర్పులు రాజ్యాంగపరంగా జరగాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని కాన్సిట్యూషనల్ క్లబ్‌లో రాజ్యసభ సభ్యుడు టి.దేవేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో ‘‘రాజ్యాంగ లక్ష్యాలు’’ అనే అంశంపై సోమవారం ఓ జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు జస్టిస్ చలమేశ్వర్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి ఎం.జె అక్బర్, జెడి(యు) సీనియర్ నేత శరద్‌యాదవ్, ఎంపీ రాపోలు అనంద్ భాస్కర్, కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్, మాజీ కేంద్ర ఎన్నికల కమిషనర్ హెచ్ ఎస్ బ్రహ్మ, జస్టిస్ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యధిక కులాలకు న్యాయం జరగాలంటే రిజర్వేషన్లు మాత్రమే పరమావధి కాదని ఆయన జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. సమనత్వం సాధన కోసం రిజర్వేషన్లు అవసరమే కాని స్వయం సమృద్ధి, సాధికారత సాధించేందుకు రిజర్వేషన్లు తొలి మెట్టు మాత్రమేనని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కూడా రిజర్వేషన్ల ద్వారా కాకుండా స్వయంకృషి, మేధస్సుతోనే ఎదిగారనేది గ్రహించాలని గుర్తు చేశారు. అలాగే నాణ్యమైన విద్య అందించేలా ప్రభుత్వాలు విధానాలు రూపొందించాలన్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి ఎం.జె అక్బర్ ఈ సదస్సులో మాట్లాడుతూ సమానత్వం కేవలం చట్టంలో ఉంటే సరిపోదని, సమాజంలో మార్పు వచ్చినప్పుడే సాధ్యమవుతుందని అన్నారు.
జేడియు సినియర్ నేత శరద్ యాదవ్ మాట్లాడూతూ కేంద్రంలో రాజ్యాధికారంతోనే బడుగుల, దళితుల అభివృద్ధి సాధ్యమన్నారు. ఎంపీ దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల వెనుకబాటుతనంపై చర్చ జరగాలన్నారు. జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలంటే విద్యావిధానంలో మార్పు, రాజకీయ చైతన్యం, భేదభావాలు తొలగినప్పుడే సాధ్యమన్నారు.

చిత్రం..‘రాజ్యాంగ లక్ష్యాలు’ అనే అంశంపై సోమవారం ఢిల్లీలో జరిగిన సదస్సులో వేదికపై జస్టిస్ జాస్తి చలమేశ్వర్,
జెడి(యు) నేత శరద్‌యాదవ్, టిడిపి ఎంపీ దేవేందర్ గౌడ్