జాతీయ వార్తలు

శ్రీనగర్ ‘నిట్’ నుంచి తెలుగు విద్యార్థులు వెనక్కి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: శ్రీనగర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) నుండి 120 మంది తెలుగు విద్యార్థులు వెనక్కు వస్తున్నారు. 15 రోజులుగా అట్టుడికిపోయిన నిట్ నుండి విద్యార్ధులు బయటకు వచ్చేందుకు కూడా యాజమాన్యం అంగీకరించకపోవడంతో విద్యార్ధులు క్యాంపస్‌లోనే భయం భయంగా గడుపుతున్నారు. అయితే విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు యాజమాన్యం ఆమోదం తెలిపింది. ఉద్రిక్త పరిస్థితుల నడుమ పరీక్షలకు హాజరుకాలేకపోయిన విద్యార్థులకు మరోమారు పరీక్షలు రాయించేందుకు మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. పరీక్షలు రాయని వారికి మరోమారు పరీక్షలు నిర్వహించాలని హెచ్‌ఆర్‌డి అధికారులు నిట్ డైరెక్టర్‌ను ఆదేశించారు. అయితే ఎన్‌ఐటిలో పరిస్థితి ఇంత గందరగోళంగా ఉన్నా అధికారులు మాత్రం పరీక్షలు నిర్వహించడం పట్ల స్థానికేతర విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు స్థానికేతర విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. స్థానికేతర విద్యార్థులు చేస్తున్న పలు డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వ హెచ్‌ఆర్‌డికి చెందిన ముగ్గురు సభ్యుల బృందం అంగీకరించింది. ఎన్‌ఐటిని వేరే ప్రాంతానికి తరలించాలన్న విద్యార్థుల డిమాండ్‌ను మాత్రం తోసిపుచ్చింది. ఇటీవల టి20 క్రికెట్‌లో భారత్ ఓడిపోయినపుడు శ్రీనగర్ ఎన్‌ఐటిలో కాశ్మీర్ విద్యార్థులకు, ఇతర ప్రాంతాల విద్యార్థులకు నడుమ ఘర్షణలు చెలరేగాయి. రోజుల తరబడి కొనసాగిన హైటెన్షన్ కారణంగా విద్యాసంస్థల్లో చదువుతున్న నాన్‌లోకల్ విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ విషయంలో వివాదం ఇంకా కొనసాగుతోంది.