జాతీయ వార్తలు

సిబిఐ వలలో ఆర్బీఐ అధికారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, డిసెంబర్ 13: నిబంధనలకు విరుద్ధంగా నగదు మార్పిడి చేసారన్న అభియోగాలపై రిజర్వ్ బ్యాంక్ అధికారి కె.మైకేల్, జెడిఎస్ నాయకుడు కెసి వీరేంద్రను సిబిఐ మంగళవారం అరెస్టు చేసింది. పెద్ద నోట్ల రద్దు తరువాత పెద్దఎత్తున నగదును అక్రమంగా మార్చటానికి ప్రయత్నించారన్న అభియోగాలపై అరెస్టు చేశారు. దాదాపు రూ.11 కోట్ల పాతనోట్లను మైకేల్ మార్చేందుకు ప్రయత్నించారని సిబిఐ ఆరోపించింది. మరో కేసులో జెడి(ఎస్) నేత వీరేంద్ర ఇంట్లోని బాత్రూమ్ నుంచి సుమారు రూ.570 కోట్ల రూపాయలను సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిసెంబర్ పదోతేదీనే వీరేంద్రను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరేంద్ర దగ్గర రూ. 2000, రూ.500 నోట్లను పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకన్నారన్నారు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాకు చెందిన తిప్పేస్వామి, వెంకటేశ్ అనే మధ్యవర్తుల ద్వారా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ మైసూర్, ఐసిఐసిఐ, కోటక్ మహేంద్ర బ్యాంకుల ద్వారా నగదు మార్పిడికి వీరు ప్రయత్నించారని సిబిఐ అధికారులు తెలిపారు. వీరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.