జాతీయ వార్తలు

‘టచ్’చేస్తే.. అంతే సంగతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: మహారాష్ట్ర కేబినెట్ కొత్త బార్ డాన్స్ బిల్లుకు ఆమోదం తెలిపింది. బిల్లు మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. బార్‌లు, పబ్‌లలో డాన్స్‌లను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి న్యాయస్థానంలో చుక్కెదురు కావడంతో కొత్త బిల్లు తీసుకొచ్చారు. అయితే కొత్త బిల్లును ఈసారి పగడ్బందీగా రూపొందించారు. బార్‌లకు వెళ్లి డాన్సులు చూసిరావడమే తప్ప ఎక్కడా అతి చేయడానికి వీల్లేదు. డాన్సర్లను ముట్టుకున్నా, వారిపైకి డబ్బులు విసిరినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. అలాంటి చేష్టలకు పాల్పడితే జైలుకు పంపడమేగాక భారీగా అంటే 50 వేల వరకూ జరిమానా విధించేలా కొత్త బిల్లులో జాగ్రత్తలు తీసుకున్నారు. అనుమతి లేకుండా బార్ నడిపితే ఏకంగా పాతిక లక్షల ఫైన్ వేస్తారు. కొత్త బార్ బిల్లు ప్రకారం విద్యా సంస్థలకు కిలోమీటర్ లోపు బార్ ఉండకూడదు. డాన్సర్లు కురచగా, అసభ్యకరంగా కనిపించేలా దుస్తులు వేసుకోకూడదు. బార్ల ఎంట్రెన్స్, ఫోర్లలో సిసి కెమెరాలను యజమానులే ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కడైనా డాన్సర్లను ‘దోచుకుంటే’ పది లక్షల జరిమానా లేదా మూడేళ్ల జైలుశిక్ష విధిస్తారు. డాన్స్‌బార్లను నిషేధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది.